చక్కెర పరిశ్రమకు 8 వేల కోట్లు. – కేంద్ర మంత్రి పాశ్వాన్.

న్యూ ఢిల్లీ.
చెరుకు రైతులకు అన్ని రకాల మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా సరఫరాల శాఖా మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ప్రతి క్వింటాల్ చెరుకుకు 5రూపాయల 85 పైసలు చెరుకు రైతుకు నేరుగా మద్దతు అందించబడుతుందని చెప్పారు. మన సంక్షేమ పథకాలుల ప్రపంచంలోనే పెద్దవని మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్ధారించుకున్న అన్ని లక్ష్యాలను దాదాపు పూర్తి చేసిందని… ఇంకా చేస్తూనే వుందని అన్నారు రామ్ విలాస్ పాశ్వాన్. చక్కెర పరిశ్రమ కోసం 8వేల కోట్ల ప్యాకేజీని కేబినెట్ కు పంపామని..దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది మంత్రి వెల్లడించారు. రేషన్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం వల్ల బోగస్ కార్డులను నివారించమన్నారు. సంక్షేమ హాస్టల్లలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు తక్కువ ధరలకు సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు.
…పాజ్..బైట్..