చట్టాలు దూరని తండాలు. ఆగని ఆడ శిశువు అమ్మకాలు.

నల్లగొండ:
ఆడపిల్లల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతున్నందున ఆడపిల్లల సంరక్షణ తల్లితండ్రులకు భారం కాకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు కొనసాగుతున్నవి.ఏ పాపం ఎరుగని పసిహృదయాలను కళ్ళుతెరువకముందే అంగడిలో వస్తువులా అమ్మేసుకుంటున్నారు.కోట్లుఖర్చు చేసి పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వాలు మారుమూల గ్రామాల్లో ఆడపిల్లలను అమ్మకుండా నిరోధించ
లేకపోతున్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లా బిబినగర్ మండలం గుర్రాల దండి గ్రామం చిన్న పలుగు తండ నివాసి భూక్యా శేఖర్ బద్రి కి భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది.ఇంతకుముందే వీరికి ముగ్గురు ఆడపిల్లలు కావడంతో ఇప్పుడు పుట్టిన ఆడపిల్లను పెంచడం భారంగా భావించి ఆ శిశువును అమ్మాలని నిర్ణయించుకున్నారు. పాపను భువనగిరి పట్టణానికి చెందిన ఆర్.ఎం.పి. డాక్టర్ నరసింగరావును కలిశారు. నరసింగరావు తనకు వరుసకు బామ్మర్ది, భువనగిరిలో ఉంటున్న నరసింహకు
సంతానం లేనందున 25 వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని జూలై 12 న
భువనగిరి ఎల్లమ్మ గుడి దగ్గర అప్పగించినాడు. ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందింది.
‘షీ టీమ్’ కు వారు తెలిపారు. పాపను అమ్మిన వారికి మధ్యవర్తిగా వ్యవహరించిన నర్సింగరావు, అతని బావమరిదిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.ఈ సంఘటనకు భాద్యులయిన 7 గురిపై కేసునమోదు చేసినట్లు భువనగిరి డిసిపి రామచంద్రా రెడ్డి శుక్రవారం తెలిపారు.