చలించిన మంత్రి హరీష్. జర్నలిస్ట్ కుటుంబం ఆత్మహత్య పై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి.

హైదరాబాద్:
జర్నలిస్ట్ హనుమంతరావు భార్య కు మెరుగైన వైద్య చికిత్స అందిచాలని వైద్యులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఆంధ్రభూమి విలేకరి హనుమంతరావు మృతి పట్ల మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. కుటంబం ఆత్మహత్య చేసుకోవటం చాలా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విలువల కలిగిన వృత్తిలో ఉంటూ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడం విచారకరం అని. యువ జర్నలిస్ట్ గా సేవలందించారని అలాంటి జర్నలిస్ట్ ని కోల్పోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం జర్నలిస్ ల సంక్షేమానికి కృషి చేస్తుందని..ప్రభుత్వం పక్షాన కుటుంబానికి భరోసా కల్పిస్తామన్నారు.. ఇలాంటి సంఘటనలకు పాల్పడటం తన మనస్సును చలించేలా చేసిందన్నారు. సమస్య పరిష్కారానికి అనేక మార్గాలు ఉన్నాయని, ఆత్మహత్యే దానికి పరిష్కారం కాదని ఆయన అన్నారు.
జర్నలిస్ట్ లకు ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకరావలని ఇలాంటి సంఘటన పునరావృతం కావొద్దు అని కోరారు. జర్నలిస్ట్, వారి పిల్లల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని వారి మృతి కి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ… కుటుంబాని ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.