చారిని గెలిపిస్తే భూపాలపల్లి గజ్వేల్ అవుతుంది. – డిప్యూటీ సీఎం కడియం.

వరంగల్:

మాజీ స్పీకర్ మధుసూదనాచారిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “మనకు ఉపయోగపడే అభ్యర్థిని గెలిపించాలి. మన ఊర్లో పచ్చదనాన్ని తీసుకొచ్చే నాయకుడు కావాలా, మనను దోచుకునే దొంగలు కావాలో మీరే నిర్ణయించుకోవాలి. మన వనరులను దోచుకొని పెట్రోల్ బంక్ లు పెట్టుకున్నారు. దోపిడీ చేసిన సొమ్ము పంచి పెడుతామంటారు. ఒకసారి పొరపాటున అవకాశమిస్తే ఇక అవినీతి, అక్రమాలు ఆగవు.కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి దేశమంతటా మాట్లాడుకుంటున్నారు.గత నాలుగేళ్లలో ఒక్కసారి అయినా కరెంట్ కోతలవల్ల పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉందా. 24 గంటలు ఉచిత కరెంట్ వ్యవసాయానికి ఇస్తున్న ఏకైక రాష్ట్రం. ఇపుడు అధికారంలోకి వస్తే రైతు ఋణం మాఫీ చేస్తామంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు గడ్డి పీకారా అని అడుగుతున్నా.

దేశంలో ఎక్కడా, ఎప్పుడు రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచించలేదు. కానీ సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టి ఏటా12వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు.రైతు ఏ కారణాల వల్ల చనిపోయిన వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు 5 లక్షల బీమా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే.వచ్చేసారి రైతు కూలి కుటుంబాలకు కూడా ఈ బీమా సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెడుతున్నారు.కంటి వెలుగు పథకం కింద 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించాలన్న ఆలోచన ఈ దేశంలో ఇప్పటి వరకు ఎవరికైనా వచ్చిందా.8 లక్షల గొల్ల, కుర్మలకు 10 వేల కోట్ల రూపాయలతో గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించి ఇప్పటికే 3.20 లక్షల మందికి ఇచ్చారు.మధుసూదనాచారి స్పీకర్ గా ఉన్నందువల్లే వందల కోట్ల రూపాయలు మీ నియోజక వర్గం భూపాలపల్లి కి తెచ్చారు.మళ్ళీ మంచి మెజారిటీతో ఆయనను గెలిపిస్తే ఇంతకంటే గొప్ప స్థాయిలో ఉంటారు.ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తారు.స్పీకర్ గా ఉండి కూడా మీరు పిలిస్తే పలికారు.ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నారు. మధుసూదనాచారిని మరోసారి గెలిపిస్తే భూపాలపల్లి ని గజ్వెల్ స్థాయికి అభివృద్ధి చేస్తారు. కొట్లాడి నిధులు తెస్తారు. గ్రామం మొత్తం మధుసూధనాచారికి ఓట్ వేస్తామని సమావేశంలో తీర్మానం చేసి ప్రమాణం చేసిన నూర్జాన్ పల్లె వాసులు. సమావేశంలో ఎంపీ బండ ప్రకాష్, టి.ఆర్.ఎస్ నాయకులు సమ్మారావు, స్థానిక నేతలు హాజరయ్యారు.