‘చార్మ్’ స‌ర్వేలో కాంగ్రెస్‌కు తిరుగు లేదు.

  • 11న డిసిసి అధ్యక్షుల‌తో రాహుల్ టెలికాన్ప‌రెన్సు: 

    హైదరాబాద్:

తెలంగాణ కాంగ్రెస్ఐ.టి వెబ్‌సైట్ ను రాహుల్‌గాంధీ ప్రారంభించనున్నట్టు ఐ.టి సెల్ చైర్మ‌న్ మ‌ద‌న్ మొహ‌న్‌ తెలిపారు.ఈ నెల 11వ తేదీన ఉద‌యం 10 గంట‌ల నుంచి దేశంలోని అన్ని డిసిసి అధ్య‌క్షుల‌తో ఎఐసిసి అధ్య‌క్షులు రాహుల్ గాంధీ ‘చార్మ్’ అప్లికేష‌న్ ద్వారా టెలికాన్ప‌రెన్స్‌లో మాట్లాడుతార‌ని మదన్ చెప్పారు. డిసిసి అధ్య‌క్షులు అందుబాటులో ఉండాల‌ని టిపిసిసి ఐ.టి విభాగం చైర్మ‌న్ మ‌ద‌న్ మొహ‌న్ వివ‌రించారు. టిపిసిసి ఐ.టి సెల్ వెబ్‌సైట్‌ను కూడా రాహుల్ ప్రారంభిస్తార‌ని ఆయ‌న అన్నారు. ఐ.టి సెల్‌కు సంబందించి జిల్లా, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి క‌మిటీల త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు. ‘చార్మ్’ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించిన స‌ర్వేల‌లో కాంగ్రెస్‌కు మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని రాబోయేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని ఆయ‌న వివ‌రించారు.