చింతమడకలో సీఎం కేసీఆర్ పర్యటన. ఏర్పాట్లలో హరీశ్ బిజీబిజీ!!

చింతమడకలో సీఎం కేసీఆర్ పర్యటన.
ఏర్పాట్లలో హరీశ్ బిజీబిజీ!!

Siddhipeta:

సిద్దిపేట నియోజకవర్గం రూరల్ మండలం చింతమడక గ్రామంలో వచ్చే వారం సీఎం కేసీఆర్ పర్యటన ఉన్నట్లు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు..సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారితో , పలు శాఖ జిల్లా అధికారులతో గ్రామ అభివృద్ధి , పర్యటన ఏర్పాట్ల పై సమిక్ష నిర్వహించారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారు స్వగ్రామానికి చాలా రోజుల తరువాత వస్తున్నట్లు , ఈసందర్భంగా ఏర్పాట్లు ఘనంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ గారు గ్రామ సమస్యలపై అధికారులతో , గ్రామ ప్రజల తో సమీక్షిస్తారన్నారు..గ్రామస్తులతో కల్సి సహపంక్తి బోజనం చేస్తారని..గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయాన్ని సందర్శిస్తారని చెప్పారు.. ఈ సందర్భంగా గ్రామంలో భూమి లేని నిరుపేదలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.. గ్రామంలో లో అభివృద్ధి పై, గ్రామ అవసరాలపై రెండు రోజుల్లో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.. గ్రామంలో త్రాగు నీటి సౌకర్యం , ఇతరత్రా వసతుల పై పలు శాఖ అధికారులకు సూచనలు చేశారు…కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చింతమడక గ్రామంలో ఉన్న చెరువులు , కుంటల కాలువల అనుసంధానం చేసే మ్యాప్ ను సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.. సీఎం కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసే దిశగా అధికారులు సమాయత్తం కావాలని చెప్పారు.