చిన్న పత్రికల సమస్యల పరిష్కారం – అల్లం నారాయణ.

హైదరాబాద్:
త్వరలో ప్రాంతీయ పత్రికల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. శుక్రవారం సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో ప్రాంతీయ పత్రికల, మేగజైన్ ల సమస్యల పై చర్చించడానికి సమావేశం జరిగింది. ముఖ్య అతిధి గా పాల్గొన్న అల్లం నారాయణ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా చిన్న పత్రికలు మ్యాగజైన్ ల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారన్నారు. కానీ దూర దృష్టవశాత్తూ పరిష్కారం అవలేదన్నారు. చిన్న పత్రికల నిర్వహణ చాలా కష్టమైన పని అన్నారు. ముఖ్యంగా ప్రకటనలు రాక పోతే పత్రికల నిర్వహణ కష్టమన్నారు. ప్రకటనలు, ఇంపాన్నేల్మెంట్ ను అక్రిడిటేషన్, హెల్త్ కార్డ్ ల కార్డుల జారీలలో చిన్న పత్రికలు మరియు మ్యాగజైన్ లకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విషయంలో సమాచార కమీషనర్ తో చర్చించగా.. సానుకూలంగా స్పందించారన్నారు. ఖచ్చితంగా చిన్న పత్రికలకు న్యాయం జరుగుతుందని, అందరూ కలిసి కట్టుగా పోరాడాలని ఆయన సూచించారు. గతంలో ఇంపాన్నేల్మెంట్ లో జరిగిన ఈ అసమానతలు సారిదిద్దాలని,ట్యాడ్ అర్హత ఉన్న వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టెంజూ అధ్యక్షులు ఇస్మాయిల్, కార్యదర్శి రమణ, ప్రాంతీయ పత్రికల ప్రతినిధి యూసుఫ్ బాబు, తదితరులు ప్రసంగించారు. ఆయా పత్రికల సంపాదకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.