చిరునవ్వుల తెలంగాణ సీఎం లక్ష్యం.

చిరునవ్వుల తెలంగాణ సీఎం లక్ష్యం.
– టి ఆర్ ఎస్ అమెరికా సెల్ సమ్మేళనంలో హరీష్.

Florida:

రైతు కళ్ళలో సంతోషాన్ని చూసే రోజులు రానున్నాయని సీఎం కేసీఆర్ పాలన ఆ దిశగా సాగుతోందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ ఆర్ ఐ ల ఆధ్వర్యంలో అమెరికాలోని ప్లోరిడా రాష్ట్రంలో ‘ట్యాంపా’ సిటీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో మీరు ఇచ్చే ఆతిధ్యం, ఆత్మీయత చూస్తే నేను హైదరాబాద్ లోనే…తెలంగాణ లోనే ఉన్నట్టు అనిపిస్తుందని చాలా సంతోషంగా ఉందన్నారు.. నేను 2010 తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో అమెరికా కు వచ్చిన సందర్భంలో 10 రోజుల్లో 14రాష్ట్రల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నాను.ఇప్పుడు 2019 ట్యాంపా లో మాత్రమే అందరిని కలిసాన్నారు.. రైతు కష్టాలు.వారు పడిన ఇబ్బందులపై ఇక్కడ పిల్లలు చేసిన డ్యాక్యుమెంటరి చూస్తే 2010 లో అప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తుంద అనుకున్నాము రాష్ట్రం వచ్చింది.. అదే విధంగా వచ్చే రెండు ఏళ్ళలో రైతు పడే కష్టాలు పోయి రైతు కళ్ళలో సంతోషాన్ని ఖచ్చితంగా చూస్తామన్నారు.. ఒకప్పుడు భారత దేశంలో అభివృద్ధి అంటే బెంగాల్ అని..దేశానికి మోడల్ కేరళ అని అనుకునే వారు..కానీ ఇప్పుడు తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని దేశ నలుములల్లో వినిపిస్తోంది… 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని..రైతులకు మిషన్ కాకతీయ, కాళేశ్వరం , పాలమూరు ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణి చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని.. రైతు బంధు, రైతు భీమా , ఎరువులు విత్తనాల పంపిణీ , మార్కెటింగ్ వ్యవస్థ, మోటార్, స్టాటార్ లేని వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులకు ఆత్మవిశ్వాసాన్ని నింపింది..వారి జీవితాల్లో భరోసానిచ్చింది టి ఆర్ ఎస్ కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తు చేశారు… మొక్క పెరిగి ఫలాన్ని ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది అని..అదే విదంగా ఒకటి ఒకటి చేసుకుంటూ ఒక ఆకుపచ్చ.. చిరునవ్వుల తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు.. ఒక వ్యవసాయ రంగమే కాదు..విద్య..వైద్యం.. విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో ప్రగతి సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.. నాటి ఉద్యమం లో నేటి అభివృద్ధి లో ఎన్ ఆర్ ఐ ల పాత్ర కీలకంగా ఉందని.. కేసీఆర్ ప్రభుత్వానికి ,టి ఆర్ ఎస్ పార్టీ కి మేలు చేయడం లో మీ సహకారం మరువలేనిదన్నారు.. మీ పట్టుదల..సమయ పాలన చాలా నచ్చిందని అభిప్రాయ పడ్డారు.. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగి దేశానికి గొప్ప రోల్ మోడల్ గా నిల్వనుందని ఈ సందర్భంగా అన్నారు.అమెరికా వెళ్లి ఇంజనీర్, డాక్టర్ ఉద్యోగాలు చేసే రోజులు చూసాం.. అదే సాఫ్ట్ వేర్ ,డాక్టర్ లు కూడా , వ్యవసాయం , సేంద్రియ వ్యవసాయం పై ఆసక్తి చూపుతున్నారు అని.. ఒకప్పుడు రైతు అంటే చిన్న చూపు ఉండే కానీ రైతు అంటే గౌరవం అనేది ఇపుడు…ఐటి ప్రొఫెషనల్ గా సంపాదించుకున్న వారు. వ్యవసాయాన్ని ప్రొఫెషనల్ గా చేసుకొనే రోజులు వచ్చే నాలుగు ఏళ్లలో రాబోతున్నాయని ఈ సందర్భంగా అన్నారు.మీరు ఉద్యోగ రీత్యా..ఉన్నత చదువుల కొరకు ప్రాంతాలు మారిన మన తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయాన్ని మారువ లేదు అని ఎన్ ఆర్ ఐ ల ను ఉదేశించి హరిశ్ రావు గారు అన్నారు.. అమెరికాలో ఉన్న మన పద్దతి, అలవాట్లు మీరు మరువ లేదు..మీ పిల్లలలో కూడా ఆ సాంప్రదాయాన్ని అలవాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు..
తొలి నిమిషం నుండి చివర నిమిషం వరకు చిరునవ్వు తోనే:
ట్యాంపా సిటీలో 3గంటల పాటు జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న హరిశ్ రావు గారు తొలి నిమిషం నుండి సమావేశం జరిగిన చివరి నిమిషం వరకు హరిశ్ రావు గారి మొహం లో చిరునవ్వు..ఆ 3గం. లలో 300 మంది ని కలవటం లో అలానే ఉండటం అక్కడి ఉన్న సిద్దిపేట వాసులను ఆశ్చర్యం కలిచిందని వారు అభిప్రాయపడ్డారు.నాయకుడు అంటే హరిశ్ రావు.. ఓపిక.. ఆత్మీయత కు మారు పేరు అని టీవీల్లో పేపర్ లలో విన్నాం..కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూశామని పలువురు ఎన్ ఆర్ ఐలు అన్నారు.సమ్మేళనానికి విచ్చేసిన హరిశ్ రావుకు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మహిళలు బొట్టు పెట్టి, మంగళహారతులతో స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా ఎన్ ఆర్ ఐల ఆధ్వర్యంలో హరిశ్ రావును సత్కరించారు.