చెక్కుల ‘సిత్రాలు’.

హైదరాబాద్:
రెవెన్యూ , వ్యవసాయ అధికారుల పనితీరును సి.ఎం.కెసిఆర్ ప్రతి సమావేశంలోనూ ప్రశంసిస్తున్నారు. మరి చెక్కులను తయారు చేసినప్పుడు ఎస్.పి.సింగ్ పేరు కూడా సరిగ్గా రాయలేకపోవడం విచిత్రం.రైతు బందు‌ పథకం‌ కింద తనకు వచ్చిన చెక్కులను‌ ప్రభుత్వానికి ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రెటరీ ఎస్.పి.సింగ్ వాపసు ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కోత్తుర్ మండలం పుంజేర్ల గ్రామంలో వ్యవసాయ భూమి కి వచ్చిన 49,900 ఒక చెక్కు 14,610 చెక్కులను రెవెన్యూ అధికారులకు ఆయన వాపసు చేశారు. అయితే ఆ చెక్కులపై సింగ్ పేరు ఏ భాషలో రాశారో తెలిస్తే దిగ్భ్రాంతికి గురవుతాము.