చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.

లింగాల:
కర్నూలు జిల్లా మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. బల్మూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు(45) తన కూతురు ఇంటికి వచ్చాడు. అతని ఆరోగ్యం బాగాలేకపోవడంతో మనస్థాపానికి గురై కూతురు ఇంటి పక్కల ఉన్న మర్రి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కుమారుడు కుర్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేస్తామని ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు,కూతురు ఉంది.