జంట ఆత్మహత్య.

రాజన్న సిరిసిల్ల:

వేములవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఒక జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగాపుర్ గ్రామానికి చెందిన విష్ణువర్ధన్, బెల్లంపల్లి పట్టణ బూడిదగడ్డ బస్తీకి చెందిన గుండారపు మౌనిక అలియాస్ సోనియా గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.