జనసేన కవాతు పాట రిహార్సల్స్!!

రాజమండ్రి:

తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 15న జనసేన తలపెట్టిన కవాతుకి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కవాతు స్ఫూర్తిని తెలియజేస్తూ సాగే గీతం కొద్దిసేపటి క్రితం విడుదలైంది. సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన పాటకు అరవింద సమేత ఆడియోతో అదిరే రీఎంట్రీ ఇచ్చిన థమన్ స్వరాలు కూర్చాడు. కవాతు గురించి చక్కగా వివరించే ‘పద పదపద పద’ అంటూ సాగే గీతాన్ని రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రచించారని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. 2001లో రిలీజైన తన బ్లాక్ బస్టర్ హిట్ ‘ఖుషీ’లోని ‘యే మేరా జహాన్’ పాట రూపకల్పన కీలకపాత్ర పోషించిన టీనేజీ కుర్రాడు థమన్ ఈ సారి జనాల్లో ఊపు, ఉత్సాహం తెచ్చేలా పాటను ట్యూన్ చేశాడని పవన్ ప్రశంసించారు. ఆ పాట రికార్డింగ్ పూర్తి వీడియోని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.