‘జర్నలిజం’ అనగా….

శ్రీనగర్:
జర్నలిస్ట్ అంటే ఏమిటో, అతని బాధ్యత ఏమిటో, కర్తవ్యం ఏమిటో ‘ రైజింగ్ కశ్మీర్’పత్రికలో పని చేస్తున్న వారిని చూసి నేర్చుకోవాలి. ఆ పత్రిక ఎడిటర్ షూజాత్ బుఖారీ టెర్రరిస్టుల తూటాలకు నేలకొరిగిన కొద్ధి గంటల్లోనే అంత విషాదంలోనూ, తమ సంపాదకుని హత్య వార్త తో దినపత్రికను ప్రచురించి తీసుకు వచ్చారు.
శాల్యూట్.