జర్నలిస్టుల గర్జన సభ.

హైదరాబాద్:
జర్నలిస్టుల సంక్షేమంపై తీర్మానం.

1)ఇళ్ళు… ఇళ్ళ స్థలాలు

మండల, జిల్లా స్థాయి విలేకరుల నుంచి రాష్ట్ర స్థాయి వరకు పని చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల వరకు అందరికి ఇల్లు..ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

*2)హెల్త్ కార్డులు*
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ JHS పథకం కింద ఉచిత ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.అక్రిడేషన్ లతో నిమిత్తం లేకుండా ప్రతి జర్నలిస్ట్ లకు హెల్త్ కార్డ్ లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

*3)సంక్షేమ నిధి*
మరణించిన జర్నలిస్టులకు ప్రస్తుతం ఇస్తున్న లక్ష రూపాయలను…3 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.

మూడు సంవత్సరాల పాటు ఇచ్చే 3 వేల రూపాయల పెన్షన్ ను 5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

4)ఉచిత విద్య
జర్నలిస్టుల పిల్లలకు KG నుండి PG వరకు ఉచిత విద్యను ప్రకటించాలని, ప్రైవేట్ పాఠశాలల్లో చదవడానికి వెంటనే ప్రభుత్వం GO జారీ చేయాలని డిమాండ్.

*5)పెన్షన్లు*
జర్నలిస్ట్ పదవీ విరమణ తరవాత ఎటువంటి పెన్షన్ రాదు. కేరళ, తమిళనాడు, అస్సాం, పంజాబ్ మాదిరిగా ఈ రాష్ట్రంలో కూడా జర్నలిస్ట్ లకు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్.

*6)ఎలక్ట్రానిక్ మీడియా ను జర్నలిస్టుల పరిధికలోకి తేవాలి*

*7)అందరికీ అక్రిడేషన్*
రాష్ట్రంలో సుమారు 25 వేల మంది జర్నలిస్టులు ఉండగా 18 వేల మందికి మాత్రమే అక్రిడేషన్ లు ఇచ్చారు.

*8)జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం*

*9)చిన్న పత్రికలను బతికించాలి*