జర్నలిస్టు హనుమంతరావు కుటుంబం విషాదంతం, భార్య హారిక మృతి.

  • చికిత్స పొందుతూ భార్య హారిక మృతి.

సిద్ధిపేట:
కొండపాక ఆంధ్రభూమి రిపోర్టర్ హనుమంతరావు కుటుంబం తోసహా ఆత్మహత్య కు పాల్పడడం అత్యంత బాధాకరం.. గతకొంత కాలంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న హనుమంతరావు. ఇతర ఆదాయ మార్గాన్ని వేతుక్కునే క్రమంలో కొంతకాలంగా పలు సంస్థల్లో LIC , SAHARA , సస్థల లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తూ ప్రయివేట్ గా గజ్వెల్ లో ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకుని అవసరం ఉన్న వారికి paan కార్డు లు ఇప్పించే ఏజెన్సీ ని నిర్వాహిస్తూ జీవనం గడుపుతున్నాడు.. అంతకు ముందు పలు చిన్న, చిన్న వ్యాపారాలు నిర్వహించి ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడ్డాడు.. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ప్రయివేట్ ఏజెన్సీ లో తన వద్ద పని చేస్తున్న ఒక మహిళ, మరో వ్యక్తి హనుమంతరావు ను మోసం చేసి సుమారు 7 న్నర లక్షల రూపాయలను దిగమింగి ఆర్థికంగా నష్ట పరిచారు.. దీంతో అటు ఆర్థిక సమస్యలు నమ్మిన వ్యక్తులే మోసం చేయడంతో తీవ్రమైన మానసిక వేదనతో కుటుంబ సమేతంగా చనిపోవాలని నిర్ణయానికి వచ్చి తాను.. ముందుగా భార్యను గొంతునులిమాడు.. ఆమె చనిపోయిందని భావించి ఇద్దరు చిన్నారి కూతుర్లను కూడా గొంతు నులిమిచంపేసి తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇది అత్యంత బాధాకరమైన విషయం.. ఎన్నో ప్రజా సమస్యల మీద వార్తలు రాసే విలేకరి తన సమస్యను పరిష్కరించుకునే విషయంలో ఆందోళన చెంది తాను ఆత్మహత్య చేసుకోవడం తో పాటు తన పిల్లల్ని చంపే స్థితికి రావడం.. సరైన విధానం కాదు.. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు పరస్పర సహకారంతో తోటి జర్నలిస్టులతో , మిత్రులతో చర్చించుకుని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చెయాలి తప్ప ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం మంచిది కాదు.. ఇలా ఎవరు చేసినా అది సమర్థనీయం కాదు.. ముక్కుపచ్చలారని చిన్నారులిద్దరు విగతజీవులు గా మారడం, అతని భార్య చావు బతుకుల మధ్య కొట్టు మిట్టడడం హృదయమున్నవారందరినీ కలిచి వేస్తున్నది.. మంచి వ్యక్తిగా, విలేకరిగా పేరు తెచ్చుకున్న హనుమంతరావు జీవితం ఇలా మిగలడం బాధాకరం.. హనుమంతరావు తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్టు గంగుల మమత,సిరిసిల్లకు చెందిన భాస్కర్ లను పోలీస్ లు పట్టుకొని వారి పై హత్యనేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.. జర్నలిస్టు లెవరు కూడా మానసిక స్థైర్యాన్ని కొల్పయి ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని, యూనియన్ దృష్తికి గాని , సహచర జర్నలిస్టు మిత్రుల దృష్టికి తీసుకు వెళ్లి పరిసఙ్కారించుకోవాలని కోరుతున్నాను.. సంఘటన విషయం తెలిపిన వెంటనే స్పందించి జర్నలిస్ట్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం తో పాటు ,తాత్కాలిక సహాయంగా అంత్యక్రియలకు 25 వేలు ఆర్థిక సహాయం అందించిన మంత్రి హరీష్ రావు గారికి టీయుడబ్ల్యూజే IJU పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెగేలియ జేస్తున్నాము..

కె.రంగాచారి
అధ్యక్షుడు
తీయుడబ్ల్యూజే (IJU)
సిద్ధిపేట జిల్లా శాఖ