జర్నలిస్ట్ ల పిల్లలకు ఉచితవిద్య -ఎం.పి.కవిత.

నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఆర్ ఎం రావుకు ఎంపీ కవిత సూచించారు. కలెక్టరేట్ ప్రగతి భవన్ లో జరిగిన మైనార్టీ సంక్షేమ శాఖ సమీక్ష సమావేశం లో ఎంపి కవితతో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొన్నారు.సంగారెడ్డి డి ఇ ఓ జర్నలిస్టులకు ఫ్రీ ఎడ్యుకేషన్ యివ్వాలని జారీ చేసిన ఉత్తర్వులను ఎంపి కవిత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉర్దూ జర్నలిస్టుల కుటుంబ సభ్యుల సీఎం ఆర్ ఎఫ్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ కవిత. వీలయినంత త్వరగా cmrf నిధులు విడుదలయ్యేలా చూడాలని డిప్యూటీ సీఎం ను కోరిన ఎంపి కవిత. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో BHEL వారి సహకారంతో 3కోట్ల రూపాయలతో హాస్టల్ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన డిప్యూటి సీఎం మహమూద్ అలీ, ఎంపీ కవిత, పాల్గొన్న BHEL ప్రతినిధులు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ వద్ద మత్య్సకారులకు ద్విచక్రవాహనాలు అందజేసిన ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లా ఎంపీ కవిత అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ.తెలంగాణలో ముస్లిం లకు 800 ఇఫ్తార్  పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.టీఆరెస్ ప్రభత్వ హయాంలో నే మైనార్టీలకు అభివృద్ధి జరుగుతోందన్నారు.