జలనిధి కాలేశ్వరం ముఖచిత్రం విడుదల

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఇంజనీర్లు, శ్రామికుల సేవలను గుర్తిస్తూ కవులు అక్షరనీరాజనం అందించడం అభినందనీయమని సాగునీటి శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు అభిప్రాయం వ్యక్తంచేశారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం అద్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మరియు జయశంకర్ సారస్వత సమితి వ్యవస్థాపకులు గడ్డం లక్ష్మయ్య లు సంకలనకర్తలుగా ఆధునిక దేవాలయాల రూపశిల్పులకు అక్షర నీరాజనం *జలనిధి కాళేశ్వరం ” పేరున సంకలనం తీస్తున్నారు.

ఇందులో బాగంగా సంకలనం ముఖచిత్రాన్ని మంత్రి హరీష్ రావు మంగళవారం వారి నివాసంలో విడుదల చేశారు.

ఈ సంకలనం లో తెలంగాణా నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా రెండువందల అరువైమందకి పైగా కవులు కవితలు పంపారని సంకలనకర్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో సంకలనకర్తలు గోగులపాటి కృష్ణమోహన్, గడ్డం లక్ష్మయ్య, గడ్డం శ్రీనివాస్, పశుపతి, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.