జలసౌధలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.

హైదరాబాద్:
సాగు నీటిశాఖ అధికారులు , ఉద్యోగులు‌ ఎర్రమంజిల్ లోని జలసౌధలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.జలసౌధలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఇంజనీర్ ఇన్ ఛీఫ్ ( కాళేశ్వరం ప్రాజెక్టు ) హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం దేశంలోనే అద్భుత ఇంజనీరింగ్ ప్రయోగమని చెప్పారు. దేశం అబ్బురపడేలా ఏడాదిలోపే 9 కీలక అనుమతులు సాధించామని, రెండేళ్లలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి ఈ వానాకాలంలోనే పాక్షికంగా నీరు అందించేకు సిద్దమవుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును సందర్షించిన వారంతా ఇది అద్భుతమని కొనియాడుతున్నారని చెప్పారు. దేశానికే ఈ ప్రాజెక్టు రోల్ మోడల్ గా మారుతుందని అభినందనలు రావడం రాష్ట్రానికి దక్కిన గౌరవమన్నారు.రాష్ట్రం ఏర్పిన తర్వాత కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ ను మారుస్తామని సాగు నీటిశాఖ ఉద్యోగులంతా ప్రజలకు వాగ్థానం చేశామని ఇరిగేషన్ శాఖ ఓఎస్టీ శ్రీధర్ రావు దేశ్ పాండే చెప్పారు. ఆ వాగ్థానం అమలు చేయడంలోఇప్పటికే చాలా అడుగులు వేశామన్నారు. మూడు దశల్లో మిషన్ కాకతీయ పనులు చేపట్టి 12 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామన్నారు. చెరువుల పూడికతీత వల్ల 9 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోగలిగామన్నారు. మూడు దశల్లో 18 వేల చెరువులను పునరుద్దరించు కోగలిగామన్నారు. నాలుగేళ్లలో 8 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామన్నారు. గత ప్రభుత్వాల నుంచి పెండింగ్ లో ఉన్న 11 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా నాలుగేళ్లలో 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ను స్థిరీకరించిమాన్నారు. మరో రెండు లక్షల పాత ఆయకట్టు స్థిరీకరించగలిగినట్లు శ్రీధర్ రావు దేశ్ పాండే చెప్పారు. దిండి, కాళేశ్వరం, పాలమూరు వంటి ప్రాజెక్టులను స్వదేశీ ఇంజనీరింగ్ తో‌నిర్మించడం మన ఇంజనీర్ల ఘనతని కొనియాడార.
సాగు నీటి రంగంలో‌తెలంగాణ అద్భుత పురోగతి సాధిస్తోందని TSWRDC ఛైర్మన్ వి. ప్రకాష్ చెప్పారు. సీఎం కేసీఆర్ దర్శకత్వంలో, మంత్రి హరీష్ రావు నాయకత్వంలో సాగు నీటి శాఖ దేశం గర్వ పడేలా పని చేస్తోందన్నారు. సాగు నీటి అభివృద్ధి జరిగిన దేశాలు, ప్రాంతాలు ప్పపంచాన్ని శాసిస్తున్నాయన్నారు. ప్రాజెక్టులు దేశానికే రోల్ మోడల్ గా మారాయన్న ప్రకాష్, ఇక భూగర్భ జలాలా రీ చార్జింగ్ పై అంతా దృష్టి సారించాలన్నారు.రాష్ట్ర పునః నిర్మాణంలో సాగు నీటిశాఖ ఇంజనీర్ల కృషి అద్భుతమని ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కొనియాడారు. కాళేశ్వరం, పాలమూరు వంటి‌ఎత్తిపోతల పథకాల ద్వారా మన రాష్ట్రం అద్భుతమైన అనుభవం గడించిందని చెప్పారు. తద్వారా మనం దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీరు ఖరిదైనదని, ఆ నీటిని ఆచి‌తూచి‌ వినియోగించుకోవాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకునే సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ లాంటి‌దేశాలు అనుసరిస్తున్న విధానాలు అధ్యయనం చేయాలన్నారు. ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతులనప చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో
ఇంజనీర్ ఇన్ ఛీఫ్ లు నాగేందర్ రావు, చీఫ్ ఇంజినీర్లు సునీల్, శ్యాంసుందర్, సురేష్ కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ ఇతర ఇంజనీర్లు ,జలసౌధ ‌ఉద్యోగులు పాల్గొన్నారు.