జాతీయ చేనేత దినోత్సవం.

హైదరాబాద్:
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

“అరువు పెట్టి నూలు తెచ్చి,
రంగులద్ది, ఆరబెట్టి,
లడీ ఒడకి, నూలు ఇప్పి,
చిటికి తిప్పి, రాట్నం ఎక్కి,
కండె కట్టి, నాడల పెట్టి,
మగ్గం గుంటకు దండం పెట్టి,
చొక్కా విప్పి, జోడు పెట్టి,
కర మగ్గం సరి చేసి,
పోగు పోగు అతికించి,
కాళ్ళను గుంటకు వదిలేసి,
సగం బాగం సజీవ సమాదియై,
మరో బాగం పిడికి వేలాడుతూ,
రెక్కలు అరిగేలా నాడ కొట్టి,
డొక్కలో పేగులు అరుస్తున్నా…
మగ్గం చప్పుడు లో మర్చిపోయి,
కాళ్ళ నొప్పులు బరిస్తూ….

గుడ్డలు నేసే నేతన్న,
నీ గుండె లో బాద ఎవరికెరుకన్నా”.