జాతీయ మీడియా కేంద్రం తో కుమ్మక్కు – వరవరరావు

 హైదరాబాద్;
కేంద్రప్రభుత్వంతో జాతీయ మీడియా కుమ్మక్కు అయిందని విప్లరచయితవరవరరావు శనివారం ఇక్కడ విలేకర్లకు చెప్పారు. తన పేరు ప్రస్తావించినట్టుగా చెబుతున్న మావోయిస్టుల లేఖలు దొరికాయని తనకు  ఫోన్ ద్వారా  మీడియా ప్రతినిధులు అడిగారని ఆయన తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నవారికి మావోయిస్టు పార్టీ ఏనాడైనా లేఖలు రాసిందా?అనివి.వి.ప్రశ్నించారు. బిజెపి పాలనలో ఆదివాసీలను వేల సంఖ్యలో హత్య చేశారనిఆరోపించారు. భీమ్ రావు కోరేగావ్ఘటనకుబాద్యుడుసంబజీ బీడే అనే ఆర్.ఆర్.ఎస్ కార్యకర్తకు పద్మశ్రీ ఇవ్వాలని చూసారనివి.వి.ఆరోపించారు. ఇద్దరుఆర్.ఎస్.ఎస్కార్యకర్తలను కాపాడే ప్రయత్నమే ఈ కుట్రలకు మూలమని వరవరరావుతెలిపారు. తెలంగాణ జిల్లాల నుండి బతుకుదెరువు కోసం  వెళ్లి, రిలయన్స్ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏడుగురిపై భీమ్ రావు కోరేగావ్ఘటనలోఅక్రమంగా కేసులు నమోదు చేశారనివి.వి.ఆరోపించారు. న్యాయవాదిసురేందర్ గాడ్గిల్, మానవహక్కుల కార్యకర్త రోనా విల్సన్ తనకు20ఏళ్లుగా పరిచయం ఉందన్నారు. వాస్తవాలు తెలియకుండా మీడియా వార్తలను  ప్రసారం చేయడం సమంజసం కాదనిపౌరహక్కులసంఘం నాయకుడు హరగోపాల్ అన్నారు. ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. భీమ్ రావు కోరేగావ్ఘటనలో మావోయిస్టుల కుట్ర ఉందనడం పెద్ద అబద్ధంఅని హరగోపాల్ ఆరోపించారు.ఈఘటనలో పదే పదే మీడియా వరవరరావు పేరు ప్రసారం చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.