జార్ఖండ్ లో ఐదుగురు మహిళలపై సాయుధుల లైంగిక దాడి. 9 మంది అరెస్టు.

ఢిల్లీ:
జార్ఖండ్ లోని గిరిజన ప్రాంతం లో ఐదుగురు మహిళలను కిడ్నాప్ చేసి తుపాకీలతో బెదిరించి అత్యాచారం. రాజధాని రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకున్న ఘటన. అవగాహన ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన ఐదుగురు మహిళలూ ఒక ఎన్జీఓకు చెందినవారే.
అత్యాచార ఘటన ను వీడియోలో బంధించి, ఎవరికయినా బయటకు చెప్తే వీడియోను నెట్ లో పెడతామంటూ బెదిరించిన దుండగులు.
సామాజిక అంశాలపై నాటికల ద్వారా అవగాహన కల్పించేందుకు వచ్చిన ఎన్జీఓ బృందం. నాటిక వేస్తుండగానే, బైక్ లపై దుండగులు వచ్చి, తుపాకీలతో బెదిరించి అడవుల్లోకి తీసుకెళ్లి మహిళలపై అత్యాచారం . ఎన్జీఓ బృందంలోని పురుషులను చావబాదిన వైనం. మెడికల్ టెస్టుల్లో అత్యాచారం జరిగిందని నిర్ధారణ. కేసు నమోదు చేసుకొని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.