‘జియో’ యూజర్లకు 2జీబీ డేటా ఫ్రీ!!

న్యూఢిల్లీ:

టెలికామ్ రంగంలోకి అడుగు పెడుతూనే పెను సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జియో సెలబ్రేషన్ ఆఫర్లు అందజేస్తోంది. జియో తన యూజర్లకు భారీ బహుమానాలు, బంపర్ ఆఫర్లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఈ సారి జియో తన యూజర్లకు వారానికి 2జీబీ డేటా బహుమతిగా అందజేస్తోంది. మీ రెగ్యులర్ ప్లాన్ లోని డేటా అయిపోగానే ఈ డేటా కలుస్తుంది. ఈ ఆఫర్‌ అక్టోబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని మై జియో యాప్ లో పేర్కొన్నారు.అయితే ఈ బహుమతి జియోకి ఉన్న 258 మిలియన్ యూజర్లకు ఇస్తున్నట్టు కంపెనీ చెప్పలేదు. కేవలం కొందరు ఎంపిక చేసిన వినియోగదారుల ఖాతాలకు మాత్రమే ఈ అదనపు డేటా కలుస్తుందని తెలిసింది. అయితే ఈ ఎంపిక చేసిన వినియోగదారులు ఎవరో, ఎలా ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ట్రయల్ పీరియడ్ సమయంలో జియో కనెక్షన్ తీసుకున్న మొట్టమొదటి విడత వారికే ఈ ఆఫర్ ప్రయోజనాలు అందజేయనున్నట్టు భావిస్తున్నారు.

2జీబీ ఫ్రీ డేటా ఎలా పొందాలి?

మై జియో యాప్ ఓపెన్ చేయాలి

జియో మొబైల్ నెంబర్ తో లాగిన్ కావాలి

మై ప్లాన్ కి వెళ్లి వివరాలు చూసుకోండి

జియో సెలబ్రేషన్ ఆఫర్ ట్యాబ్ లో వివరాలు ఉంటాయి.