జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి ‘రెడ్ క్రాస్’ బంగారు పతకం.

వనపర్తి:
వనపర్తి ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఉత్తమ సేవలందించినందుకు గాను 2016- 17 సంవత్సరానికి ఇచ్చే బంగారు పథకానికి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఎన్నికయ్యారు.
ఈ మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ నుండి జిల్లా కలెక్టర్ కు సమాచారం అందింది. ఆగస్టు 10న హైదరాబాదులో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్. నరసింహన్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఈ బంగారు పతకాన్ని స్వీకరించనున్నారు. జిల్లా కలెక్టర్ కు బంగారు పతకం రావడం పట్ల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ, జిల్లా అధికారుల సంఘం అలాగే ఇతర ఉద్యోగ సంఘాలు, అధికారులు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.