జుత్తు కత్తిరించుకున్న సోనాలి.

ముంబయి;
బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే గుండె నిబ్బరాన్ని మెచ్చుకోవాల్సిందేనబ్బా. ప్రాణాంతక హై గ్రేడ్ కేన్సర్ వచ్చిందని కుంగిపోకుండా చిరునవ్వుతో ధైర్యంగా చికిత్స తీసుకుంటోంది. భయంకరమైన చికిత్స కారణంగా తన అందమైన ఒత్తయిన జుత్తు ఊడిపోతుందని కానీ ముఖం అందవికారంగా కావచ్చనే భయం కానీ లేనే లేదు సోనాలికి. కేన్సర్ ట్రీట్ మెంట్ లో ప్రధానమైన రేడియేషన్, కీమోథెరపీ వల్ల జుత్తు ఊడిపోతుందని తెలిసి ముందుగానే తన పొడవాటి జుత్తును చిన్నగా కత్తిరించుకొంది. ఆ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టింది. కష్టకాలంలో తను ఒంటరినని ఫీలవ్వకుండా తమ ప్రేమాభిమానాలతో కొండంత బలాన్నిచ్చిన, మద్దతు తెల్పిన సహ నటీనటులు, లక్షలాది అభిమానులకు తన ధన్యవాదాలు తెలిపింది సోనాలి. ప్రస్తుతం తను ప్రతి రోజుని ఎంతో సానుకూల దృక్పథంతో ప్రారంభించి సవాళ్లను ఎదుర్కొని జీవించడం నేర్చుకుంటున్నట్టు ట్వీట్ చేసింది.