జులై నెలాఖరులోగా‌ సుందిళ్ల బ్యారేజీ. మంత్రి హరీష్ రావు.

సుందిల్ల:
కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజీ, పంప్ హౌస్, గ్రావిటీ కెెనాల్ పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. మంత్రి రాత్రి సుందిళ్ల వద్ద బస చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గుత్తేదారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. కన్నెపల్లి పంప్ హౌస్ పనులకు‌ సంబంధించిన గుత్తేదారులను జులై 15 కల్లా 4 పంప్ హౌస్ లు పూర్తి‌ చేయాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన మోటార్లు బిగింపు పనులు‌ వేగవంతం చేయాలన్నారు. మోటార్లు కు రూఫ్ షెడ్ నిర్మించాలని సూచించారు.మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల హెడ్ రెగ్యులేటర్ల పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు, ట్రాన్సిట్ గేట్ల పనులు వెంటనే పూర్తి‌ చేయాలని సూచించారు. అండర్ స్లూయిజ్ గేట్ లను ముందుగా పూర్తి చేయాలన్నారు. పనులన్నీ పూర్తయివరకు ఇంజనీర్లు ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించారు. పనులు నిర్వహిస్తున్న ఎజెన్సీ ఎండీలతో మంత్రి హరీష్ రావు ఫోన్లో‌మాట్లాడారు. కార్మికులు, యంత్ర సామగ్రి.. సంఖ్య పెంచి పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రాజెక్టు పనుల్లో‌ఎలాంటి అవాంతరాలు వచ్చినా తన దృష్టికి వెంటనే తేవాలన్నారు.
సుందిళ్ల బ్యారేజీ పనులు ఆగష్టు 15 వ తేదీలోగా పూర్తి చేసే ఆలోచనతో ఇంజనీర్లు, గుత్తే దారులు ఉన్నారని చెప్పారు. జులై 15 వ తేదీలోగా పనులు పూర్తి చేయలని చెప్పారు. ఈ సారి రుతుపవనాలు ముందుగా వస్తున్నాయని, ఎస్.ఆర్.ఎస్.పీ , కడెం ప్రాజెక్టు లోకి ఇప్పటికే నీరు వచ్చి చేరుతుందని చెప్పారు. ఆ నీరు సుందిళ్ల బ్యారేజీ లోకి వచ్చే అవకాశం ఉందని, అందువల్ల బ్యారేజీ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించనట్లు చెప్పారు.. 1200 కార్మికులు పని చేస్తున్నారని, మరో 600 మంది కార్మికులను పెంచి పనుల వేగం పెంచాలని సూచించినట్లు తెలిపారు వర్షం పడుతున్నపుడు పనులు ఆపాల్సి వస్తున్నందున, నష్టపోయిన పనిని సకాలంలో పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్య పెంచనున్నట్లు చెప్పారు. బ్యారేజీ కి సంబంధించి 74 గేట్ల లో 24 గేట్లు బిగించారని, మరో యాభై గేట్లు బిగించాల్సి ఉందని చెప్పారు. ప్రతీ రెండు రోజులకు ఒక గేట్ చొప్పున బిగిస్తున్నారన్న మంత్రి హరీష్ రావు ఈ గెట్ల బిగింపు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. మేడిగడ్డ నుంచి సుందిళ్ల కు నీరు తెచ్చుకునే ప్రణాళిక అయితేఎస్.ఆర్.ఎస్.పీ ,ఎల్లంపల్లి నుంచి బ్యారేజీ లోకి నీరు వచ్చే పరిస్థితులు తలెత్తాయన్నారు. 11టీఎంసీల‌ నీటిని నిలుపుకునేలా బ్యారేజీ పనులు ‌వేగంగా పూర్తి చేయాాలని ఇంజనీర్లు, గుత్తేదారులను ఆదేశించానన్నారు. ప్రస్తుతం తొమ్మిదిన్నర లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను లక్షా యాభై క్యూబిక్ మీటర్ల పని పూర్తి‌చేయాల్సి ఉందన్నారు. రికార్డు సమయంలో నాణ్యత తో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఎడమ వైపు గైడ్ బండ్ పనులు తొమ్మిదిన్నర కిలోమీటర్లు పూర్తి కావోస్తుందన్నారు. రివిట్మెంట్ పనులు కు కార్మికుల సంఖ్య ను పెంచాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. కుడి వైపు గైడ్ బండ్ పనులు యాభై శాతం పనులు పూర్తయ్యాయని, మరో యాభై శాతం పనులు మిగిలి ఉందన్నారు. వర్షం వల్ల పనులకు కొంత ఆటంకం కలుగుతుందని..ఈ సవాల్ ను అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.యంత్రాలు,కార్మికుల సంఖ్య పెంచి పని వేగంగా చేయాలని సూచించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.