జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్లో భర్తను హతమార్చిన భార్య.

హైదరాబాద్:
జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్లో భర్త ను భార్య హత్య చేసిన ఘటన జరిగింది. సంఘటన స్థలానికి క్లూస్ టీమ్స్ పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు. గుంటూరు జిల్లా మాచర్ల కి చెందిన జగన్ దేవిక భార్య భర్తలు. అయితే పెళ్లైన దగ్గర్నుండీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి జగన్ మద్యం మత్తులో ఉండగా, అతని నోట్లో ‘హిట్’ కొట్టి హతమార్చింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.