జూలై లో సుందిళ్ల, అన్నారం పూర్తి. డిసెంబర్ లో మేడిగడ్డ పూర్తి: మంత్రి హరీశ్ రావు.

కాళేశ్వరం;
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిల్ల పనులు వచ్చే జూలై లో పూర్తి చేసేలా, మేడిగడ్డ పనులు డిసెంబర్ కల్లా పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు చెప్పారు ఆయన గురు, శుక్రవారాల్లో ఈ ప్రాజెక్టు పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.రెండు రోజులపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ,లింక్ వన్ పనులను  సమీక్ష చేశానని మంత్రి తెలిపారు.ఇందులో మూడు బ్యారేజి లు, మూడు  పంప్ హౌసే ల నిర్మాణం జరుగుతోందన్నారు.అటవీ, పర్యావరణ, మైనింగ్ అనుమతుల వంటి సవాళ్లను అధిగమించి కాళేశ్వరం పనులు ప్రారంభించామణి గుర్తు చేశారు.అన్నారం బ్యారేజి పనుల్లో 11 లక్షల క్యూబిక్ మీటర్ల  కాంక్రీటు పనుల్లో 9 లక్షల 70 వేల క్యూబిక్  మీటర్ల పని అయిందని, మరో లక్షా 30 వేల క్యూబిక్ మీటర్ల పని త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. అన్నారం బ్యారేజి లో 66 గేట్లకు గాను 45 గేట్ల‌నిర్మాణం పూర్తయింది.  21  గేట్ల‌ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు.
45 గేట్లలో 18 గేట్లను బిగించడం‌జరిగిందని చెప్పారు. మిగతా గేట్ల తయారీ, బిగింపు వేగం పెంచాలని అధికారులను ఆదేశించామణి ఆయన తెలిపారు.ప్రస్తుతం 8 క్రేన్లతో పనులు చేస్తున్నారని, మరో 8 క్రేన్లు అదనంగా వాడి వారానికి 9 గేట్లు బిగించాలని ఆదేశించినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.అలాగే
కార్మికులు, సిబ్బంది సంఖ్యను పెంచాలని ఆదేశించినట్టు మంత్రి తెలియజేశారు.అన్నారం బ్యారేజి పనులు రెట్టింపు వేగంగా చేయాలని సూచించినట్టు ఇరిగేషన్ మంత్రి పేర్కొన్నారు.అన్నారం పరిధిలో మంచిర్యాల వైపు, భూపాలపల్లి జిల్లా వైపు ఒక్క ఎకరం ముంపు కాకుండా గైడ్ బండ్ (కరకట్ట)‌లు నిర్మిస్తున్నామని తెలిపారు .బ్యారేజి‌ఎడమ వైపు 13 km కు గాను 11. Km  పూర్తయిందన్నారు. మిగిలిన రెండు కిలోమీటర్లు వేగంగా పూర్త చేయాలని , కుడివైపు  పది కిలోమీటర్ల కు గాను ఆరున్నర కిలోమీటర్లు పూర్తయిందన్నారు. మరో మూడన్నర  కిలోమీటర్ల దూరం కరకట్ట నిర్మాణం చేపట్టాల్సి‌ఉందని చెప్పారు. వాటి పనులు వేగంగా చేయాలని సూచించినట్టు హరీశ్ రావు విలేకరులకు తెలిపారు. నదిలో రివిట్మెంచ్ పనులు‌ ఆలస్యంగా జరుగుతున్నాయని, వాటి పనులు వేగంగా చేయాలని ఆదేశిన్చినట్టు మంత్రి చెప్పారు.సుందిళ్ల బ్యారేజి లో పది లక్షల ‌క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని  చేయవలసి ఉండగా ఇప్పటి వరకు 8 లక్షల 40 వేల క్యూబిక్ మీటర్ల పని జరిగిందన్నారు. మిగిలిన లక్షా 60 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనిని జులై 15 వ తేదీలోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.ఈ బ్యారేజి లో 74 గేట్లకు గాను 64 గేట్లు తయారు చేశారని, మరో పది గేట్లు తయారు చేయాల్సి ఉందన్నారు.ఈ బ్యారేజీలో 17 గేట్లు మాత్రమే బిగించారు. వారానికి 8 _ నుంచి‌9 గేట్లు బిగించాలి.. లేబర్ సంఖ్య ను పెంచాలని ఆదేశించారు.అన్నారం బ్యారేజి నుంచి‌ కన్నెపల్లి పంప్ హౌస్ వరకు గ్రావిటీ‌కెనాల్ పోడవు 13 కి.మీ. కాగా
జనవరి తొలి వారంలో  అనుమతులు సాధించినా యుద్ధ ప్రాతిపదిన పనులు ప్రారంభించి రికార్డు సమయంల‌ో ఆరు నెలల కాలంలో చెట్లు తొలగించామణి మంత్రి హరీశ్ రావు తెలిపారు.గ్రావిటీ కెనాల్  పనులు 90 శాతం తవ్వకం పూర్తయిందన్నారు.మరో 12 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వాల్సి‌ఉందన్నారు.పెద్ద వాగు వద్ద యూటీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని,
లేబర్ ను రెట్టింపు చేస్తున్నట్టు తెలిపారు. మేడిగడ్డ‌‌ సిబ్బందిని ఇక్కడ పని చేయించి పనులు పూర్తి చేస్తామణి మంత్రి తెలిపారు.ఈ గ్రావిటీ కెనాల్ లో‌29 ‌స్ట్రక్చర్ల నిర్మాణ పనులు మంచి పురోగతిలో ఉన్నాయన్నారు.ఈ ప్రాజెక్టుకు‌ సంబంధించి తొలి మోటార్  ఆస్ట్రియా హంట్రిట్జ్ కంపెనీ‌ చెందిన హండ్రిట్జ్ కంపెనీ పంపులు,, ఫిన్లాండ్ కు చెందిన ఏబీబీీ కంపెనీ  మోటార్లు కన్నెపల్లి‌పంప్ హౌస్ కు  చేరాయని మంత్రి తెలియజేశారు..మోటార్లు నాలుగైదు రోజుల్లో బిగిస్తామణి చెప్పారు.కన్నెపల్లి వద్ద 11 మోటార్లు, అన్నారం వద్ద 8 మోటార్లు, సుందిళ్ల వద్ద 9  మోటార్లు బిగిస్తామని చెప్పారు.పనుల వేగం పెంచడానికి మోటార్లు కొన్ని ఎయిర్ కార్గోలో తెప్పిస్తున్నామణి హరీశ్ రావు వివరించారు.తొలి దశలో‌1  టీఎంసీ  నీళ్లను తేవడం, అక్టోబర్ నాటికి మిగతా 2 టీఎంసీ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామణి ఆయన చెప్పారు.అక్టోబరు నాటికి  3  పంప్ హౌస్ లలో అన్ని మోటార్లు బిగిస్తామణి మంత్రి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెెక్టులో‌  మూడు‌‌ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి తెలిపారు.
కన్నెపల్లి పంప్ హౌస్  వద్ద 220kv, అన్నారంలో 220kv,  గౌలివాడ వద్ద 400/220 kV సబ్ స్టేషను  పనుల‌వేగం పెంచాలని జూన్ 25  నాటికి పూర్తి‌చేయాలని ఆయన ఆదేశించారు.జూన్ లో‌వర్షాలు వస్తే  పనులు మందగిస్తాయని అందుకే పనుల వేగం పెంచాలని ‌ఆదేశాలిచ్చామణి చెప్పారు.
ఖచ్చితంగా వచ్చే 45 రోజుల్లో‌సిబ్బంది అంతా 18 గంటల పాటు సైట్‌లో ‌ఉండి పని చేయాలని మంత్రి ఆదేశించారు.మరో 18 మంది జే.ఈలను అదనంగా ఈ ప్రాజెక్టు కోసం పోస్టింగ్లు ఇచ్చినట్టు హరీశ్ రావు వివరించారు.గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు , లిప్ట్ నిపుణులు వారంలో రెండో రోజులు ప్రాజెక్టు వద్దే ఉండి పర్యవేక్షణ జరపాలని మంత్రి ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్బుతమైన ఇంజనీరింగ్ విధానంతో కొనసాగుతుందని కేంద్ర జల సంఘ సభ్యులు ప్రశంసించారు. ప్రపంచంలోనే సాగు నీటి  ప్రాజెక్ట్ ల నిర్మాణంలో చైనా మొదటి స్థానంలో ఉండేదని, కాని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో బారతదేశం, చైనా దేశాన్ని మించిపోయిందని, ఈ ప్రాజెక్ట్ ఓ అద్బుతమని డిల్లి నుండి వచ్చిన కేంద్ర జల సంఘ సభ్యులు ఎస్.కే రాజన్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో నిర్మాణం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను డిల్లీ నుండి వచ్చిన 13 మంది కేంద్ర జల సంఘ సభ్యుల బృందం  పరిశీలించారు. మొదటగా జిల్లాలోని  పాలకుర్తి మండలం వేమునూర్ శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆయకట్టు వద్ద నిర్మాణం చేపట్టిన ఓపెన్ గ్రావెటి కెనాల్ ను పరిశీలించి అనంతరం అక్కడి నుండి ధర్మారం మండలం మేడారంకు చేరుకున్న సభ్యుల బృందం ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ
శైలికి సంబంధించిన చిత్ర పటాల పరిశీలించి అక్కడి నుండి, గోదావరి జలాలను తరలించడానికి భూమి లోతుల్లో నిర్మిస్తున్న సొరంగ మార్గాన్ని పరిశీలించారు. ఆ పక్కనే నిర్మాణం అవుతున్న పంప్ హౌజ్ మరియు సర్జ్ ఫుల్ పనులను పరిశీలించారు. దేశంలోనే మొదటి సారిగా గ్యాస్ సిలిండర్స్ తో నిర్మాణం అవుతున్న పవర్ స్టేషన్ ను పరిశీలించారు…  పనుల పురోగతిని తెలుసుకోగా వచ్చిన బృందానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆరోవ ప్యాకేజి నిర్మాణం పనులు చేస్తున్న నవయుగ కంపెని డైరెక్టర్ వెంకటరామ రావు ప్రాజెక్ట్ శైలిని వివరించారు.  అనంతరం కేంద్ర జల సంఘ సభ్యులు ఎస్.కే రాజన్ మీడియా మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చాల అద్బుతంగా జరుగుతున్నాయని, గతంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ లు చైనా దేశం మాత్రమే నిర్మించేదని కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో బారతదేశం చైనా దేశాన్నే మించి పోతుందని ఇదొక మహా అధ్బుత ప్రాజెక్ట్ అని అయన అన్నారు… ఈ సందర్శనలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సిఈ వెంకటేశ్వర్లు , ఈఈ నునే శ్రీధర్, డిఈ నర్సింగ రావు, ఎ.ఈ ఉపేందర్, రాకేష్ తో పాటు పలువురు ఇంజనీరింగ్ అధికారులు మంత్రి వెంట ఉన్నారు…