జూలై 13 న టీజేఎస్ ప్లీనరీ !!

hyderabad:

జులై 13న తెలంగాణ జనసమితి పార్టీ ప్లీనరీ సమావేశం జరగనున్నది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు కోదండరాం బుధవారం చెప్పారు. రాష్ట్రానికి కొత్త భవంతులు కాదని, ఆస్పత్రులు, హాస్టళ్లలో వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఒక్క వాన పడితే నగరం గందరగోళంగా మారుతోందన్నారు. హడావుడిగా నదుల అనుసంధానం సరి కాదన్నారు. గోదావరి నీళ్లు కృష్ణా బేసిన్‌కు తీసుకొస్తే ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని గుర్తుచేశారు. ‘నదుల అనుసంధానం’ పేరుతో విభజన సమస్యలను పక్కన బెడుతున్నారని విమర్శించారు.