జైళ్ల శాఖ లో డిష్యుం.. డిష్యుం.

హైదరాబాద్:
తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు బజారున పడ్డారు. అవినీతి ఆరోపణలకు కేరాఫ్ గా మారిన చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరిండెంట్ దశరత ఈసారి టార్గెట్ అయ్యారు. చర్లపల్లి జైలులో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినదుకు డిప్యూటీ సూపరిండెంట్ దశరతం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాడర్లు ఆరోపించారు, చర్లపల్లి జైల్లో అధికారుల అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు,
చర్లపల్లి జైలు అవినీతి కేరాఫ్ దాన్ని నిజం చేస్తూ మరోసారి ఆ జైలు అధికారులు పరస్పర విమర్శలు పిర్యాదులతో రోడ్డునపడ్డారు కిందిస్థాయి సిబ్బందిపై కక్షసాధింపు సాధింపులతో పాటు అవినీతికి పాల్పడుతున్నారని ఏకంగా జైళ్ల వాడర్లే ఆరోపించడం సంచలనంగా మారింది,చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరిండెంట్ దశరతం అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయంటున్నారు వాడర్లు చెప్పినట్టు వినాలని హుకుం జారీ చేస్తున్నారని ఆరోపించారు, వినకపోతా భయబ్రాంతులకు గురిచేయడంతోపాటు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు వార్డ ర్లు.కొంతకాలంగా డిప్యూటీ సూపరిండెంట్ దశరతం,వాడర్లకు మధ్య వివాదం కొనసాగుతుంది అవినీతి అక్రమాలు ఆదాయ మార్గాలపై ప్రశ్నించినదుకు కొందరు వాడర్లను డిప్యూటీ సూపరిండెంట్ దశరతం టార్గెట్ చేశాడని తెలుస్తుంది.చర్లపల్లి జైల్లో సెల్ ఫోన్లు,గంజాయి, బీడీ కట్టలు లాంటి నిషేధిత వస్తువులను డిప్యూటీ సూపరిండెంట్ దెగ్గరుండి నిందితులకు అందిస్తున్నాడని వాడర్లు ఆరోపణ అక్రమాలను ప్రశ్నించినందుకే తమపై కక్షకట్టి కావాలనే చర్లపల్లి జైలు నుంచి బదిలీ చేయించారని వాడర్లు ఆరోపణ..
డిప్యూటీ సూపరిండెంట్ దశరతం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జైల్లో అక్రమాలు కోతేమి కాదు కానీ డిప్యూటీ సూపరిండెంట్ దశరతం పై వాడర్లు అవినీతి ఆరోపణలు చేయడమే సంచలనం మారింది. దీనితో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. చర్లపల్లి జైల్లో డిప్యూటీ సూపరిండెంట్ గా చింతల దశరతం విధుల్లో చేరినప్పటినుంది నేటిదాకా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. దళిత మహిళా జైల్ జూనియర్ అసిస్టెంట్ ప్రవళికపై లైంగిక వేధింపులు పాల్పడడంతో కుషాయిగూడ PS లో కేసు నమోదు అయింది దళిత వాడర్ పరయ్య పై దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడు జైల్లో సెల్ ఫోన్లు, గంజాయి, నిషేధిత వస్తువులు VIP ఖైదీలకు చేరవేయడంలో దశరతం ది కీలక పాత్ర తనకంటే చిన్న ఉద్యోగులపై మానసికంగా శారీరకంగా వేధించడం ఇతని నైజం డిప్యూటీ సూపరిండెంట్ గా విధులు నిర్వర్తించేదిపోయి డిజి, వికే సింగ్ కు ఇంఫార్మర్ గా పనిచేస్తున్నాడు తనకు గిట్టని జైలు సిబ్బందిపై డిజి వికే సింగ్ కు లేనిపోనివి చెప్పి వీకే సింగ్ ని తప్పుదారి పెట్టించాడని జైలు సిబ్బంది అంటున్నారు దశరతంపై అవినీతి ఆరోపణలు వచ్చిన అవి నిజమైన డీజీ వెనుకేసుకురావడంలో ఆంతర్యం ఏంటని జైలు సిబ్బంది ప్రశ్నిస్తుంది గతంలో దశరతం వేధింపులు భరించలేక ఆరు మంది ఖైదీలు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు కొంతమంది జైలు సిబ్బంది ఐజీ, డీఐజీ లకు పిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు మహమ్మద్ పహిల్వాన్ అనుచరులకు సెల్ ఫోన్లు సరఫరా చేస్తూ నెలనెల మామూళ్లు ఇవ్వనందుకు ఇతనే సెల్ ఫోన్లు అందించి మళ్ళీ పట్టుకున్నట్టు నటించడంతో చెయ్యి విరక్కొట్టారు. దశరతం అరాచకాలు భరించలేకపోతున్నామని అంటున్న చర్లపల్లి జైలు సిబ్బంది ఆరు మంది వాడర్లు దశరతం అవినీతి అక్రమాలకు పూసగుచినట్లు మీడియా తెలిపారు చర్లపల్లి జైలు వాడర్ల ఆందోళనకు ఓయూ జాక్ నేతలు ప్రజా సంఘాలు సంగీభావం తెలుపుతున్నారు..చింతల దశరతం ను సస్పెండ్ చేసేంతవరకు తమ ఆందోళన ఆగదని ప్రజా సంఘాల నేతలు, ఓయూ జాక్ నేతలు, చెపుతున్నారు. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.