టిఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ అవగాహన.

హైదరాబాద్:
ఈ నెల 21న మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల అవగాహన సదస్సు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అభ్యర్థులతో స్వయంగా మాట్లాడుతారు. ప్రచారంలో అనుసరిచాల్సిన వ్యూహం, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై అభ్యర్థులకు ఈ సదస్సులో అవగాహన కల్పిస్తారు. పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థులు ఈ సమావేశంలో విధిగా పాల్గొనాలని పార్టీ ఆదేశించింది.