టిఆర్ఎస్ కు డబుల్బెడ్రూమ్ స్కీమ్ముచ్చెమటలు.

ఆదిలాబాద్;

వచ్చే ఎన్నికల నేపథ్యంలో డబుల్ బెడ్ రూమ్ పథకం  అధికారపార్టీప్రజాప్రతినిధులకుముచ్చెమటలు పట్టిస్తున్నది. ఈ పధకం కింద ఇళ్ళుమజూరుకానివారుప్రభుత్వం పై వ్యతిరేకత పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నవి. క్షేత్ర స్థాయిలో అసంతృప్తి పెరిగి ప్రభుత్వానికి,స్థానిక శాసన సభ్యునికి‘మైనస్’ అయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. అక్కడక్కడ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ ,నిర్మల్ ప్రాంతాల్లోబయటపడ్డ‘నెగెటివ్ అంశం’ అధికార పక్షానికి వణుకు పుట్టిస్తోంది.  నిర్మల్ లో 45 ఇండ్లను నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించారు. పంపకాలుచేసిఇచ్చామనే సంతోషం ఎంజాయ్ చేయకముందేఅక్కడనిరసనలువెల్లువెత్తాయి. ఒక్కింట్లోనలుగురికి ఇచ్చారని కొందరు, తమ ఇంట్లో ఒక్కరికైనా ఇవ్వలేదని ఇంకొందరు హైరానా సృష్టించడంతోగందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకగ్రామంలో ఇచ్చిన 45 ఇండ్లు మంజూరు చేయగా,అక్కడ అటోఇటో వంద ఓట్లు ఏటూ పోవనిటిఆర్ ఎస్ నాయకులు అనుకున్నారు. కాని మిగతా 8 నుండి 9వందల ఓట్లు మైనస్ అవుతాయన్న భయం ఆ నాయకులకు పట్టుకున్నది. ఈ పధకం కలిసొస్తుందనుకుంటే  రివర్స్ అవుతుండడం అంచనా వేయనే లేదని చేతులు కాలాక ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లాలో కోట్ల రూపాయల నిధులిచ్చినా నిర్మాణాలకు సవాలక్ష అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒక్కచోట భూమి లేక మరోచోట ఫారెస్ట్, రెవెన్యుక్లియరెన్స్ కొర్రీలు, మరో  చోట కోర్టు కేసు, ఇలా ఏదో చోట, ఎదో ఒక సమస్యతలెత్తుతున్నది. ఇల్లు  ఇవ్వని చోట  ఒకసమస్య అయితే, ఇచ్చిన గ్రామాల్లో పాజిటీవ్కంటేనెగేటీవ్ ఎక్కువగా కనిపిస్తుండడం అధికారపక్షాన్ని కునుకు లేకుండా చేస్తున్నది.క్షేత్ర స్థాయిలో మంత్రులు,  ఎమ్మెల్యేలు ఎదుర్కొన్న నిరసన సెగలు ఎదుర్కోక తప్పడం లేదు. కాంట్రాక్టర్లనుబతిమిలాడి,ఇసుకఫ్రీగా ఇచ్చి సిమెంట్ రాయితీలిచ్చి,సలాకలు  సమయానికి అందించి,భూమిని దానం చేయించి,ఆఖరికిఇల్లు మంజూరు చేస్తే పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం విశేషం. ముందే నిధులు జిల్లాలకు రిలీజ్ చేసినా అక్కడక్కడా అరకొర నిధులే ఖర్చవుతున్నాయి.నియోజకవర్గాల్లో కనీసం పది, ఇరవై కూడా ఇండ్ల నిర్మాణం పూర్తికాకపోవడం విమర్శలకు గురిచేస్తున్నది.కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా టెండర్ల దశ సైతం పూర్తీ కాలేదు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ కారణాల వల్ల  డబుల్ బెడ్ రూమ్ పథకం అమలులో తీవ్ర  జాప్యంజరుగుతున్నది. మంత్రులు,యంపి లు, శాసనసభ్యులు పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలంగాణ సర్కార్ పేదల కోసం ప్రవేశ పెట్టిన  అత్యుత్తమ స్కీమ్ గా  డబుల్ బెడ్ రూమ్పథకం జాతీయ స్థాయిలోనేహై లైట్ గా నిలిచింది.చాలా మంది అర్హులైన వారు డబుల్ బెడ్ రూమ్  కోసం క్యూలు కట్టడమే నేతలకు తలనొప్పిగా మారింది. ఈపథక౦ అమలుకు  పారదర్శకంగా మార్గదర్శకాలు నిర్దేశి౦చినప్పటికీ, నేతల కనుసన్నల్లోనే మంజూరు జరుగుతోంది. కరవ బోతే కప్పకు కోపం విడిపించేందుకు పోతే  పాముకు కోపం అన్న చందంగా ఎవరికీ మంజూరు చేయాలో  తెలియని సందిగ్ధం నెలకొంది. డబుల్ బెడ్రుం పథకం నేతలకు ట్రబుల్ గా మారింది.  లేని  కొత్తసమస్యలకు నేలవయి౦ది. ఆచి తూచి మంజూరు చేస్తున్న గ్రామాల్లో కార్యకర్తలు, అభిమానులు  సంత్రుప్తికిగురవుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ అన్నమాటప్రకారం ఇండ్లు కట్టిస్తుంటే ప్లస్ కంటే మైనస్ ఎక్కువగా అవుతుందా..?మంజూరి విషయంలో పోటి ఎక్కువగా ఉండటంతో పారదర్శకత పాటించలేకపోతున్నారా?ఇళ్ళ నిర్మాణం కోసం ఏ సంస్థలు ముందుకు రావడం లేదా? కాలనీ లు గా నిర్మించాలన్న ఆలోచన ఎందుకు వర్కౌట్ కావడం లేదు.మూడేళ్ళ నుంచి మంజురయిన ఇల్లు ఒకటి అరా ప్రాంతం మినహా ఎక్కడా ఎందుకు గృహ ప్రవేశాలు జరగటం లేదు.