టిఆర్ఎస్ పనైపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది – జీవన్ రెడ్డి, సీఎల్పీ ఉపనేత.

కేసీఆర్ స్థానిక సంస్థలకు నిర్వీర్యం చేస్తున్నట్టు సీఎల్పీ ఉప నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు.
గ్రామాల అభివృద్ధికి ఈ నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఒక్కపైసా నిధులు విడుదల జరగలేదని చెప్పారు.గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులేనని స్పష్టం చేశారు.
కేంద్రం నిధులు మినహా..గ్రామాల అబివృద్ది కి రాష్ట్ర నిధులు రాకపోవడం దురదృష్టకరమని జీవన్ రెడ్డి అన్నారు.’మన ఊరు మన ప్రణాళిక’ పట్టాలెక్కలేదు, గ్రామ జ్యోతి వెలగక ముందే అదిరిపోయిందన్నారు.ఉపాధి హామీ, 14 వ ఆర్థిక సంఘం నుండి మాత్రమె వస్తున్నాయని ఆయన చెప్పారు.రాష్ట్రం నుండి ఒక్క రూపాయి ఇవ్వకపోగా.. పంచాయతీ నిర్వహణ కు కూడా 14 వ ఆర్థిక సంఘం నిధులే వాడుతున్నారని విమర్శించారు.కుట్ర పూరితంగా స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు.
2016 లో సుప్రీం తీర్పు ఇచ్చింది.. మధ్యంతర ఉత్తర్వులు తొలగించి.. కొత్త బీసీ జన గణన చేయాలన్నది.బీసీ ల మీద ప్రేమ ఉంటే.. హైకోర్టు ఉత్తర్వులు రాగానే జన గణన చేసింటే.. పంచాయతీ ఎన్నికలు జరిగేవని తెలిపారు.
2017 లోనే అదనంగా బీసీ గురుకులాలు, 2018 విద్యా సంవత్సరంలో తెరుస్తా అని ఇప్పుడు 2109 ..20 కి అంటున్నావు.. నీ ప్రకటన మీద నీకే పట్టు లేదన్నారు.సర్పంచ్ ఉండగానే .. సెక్రటరీ అందుబాటులో లేడు ఇప్పుడెలా ఉంటాడు.. నియామకం చేస్తే 6 నెలల ముందే మేలుకోవాల్సిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అన్నారు.పారిశుధ్య కార్మికులకు 5000 కనీస వేతనం అని ఉత్తర్వులు ఇచ్చి.. అమలు చేయడం లేదు.. 99 శాతం దళితులు వారికి కూడా ఇవ్వలేరా? 180 కోట్లు లేవా? అని ప్రశ్నించారు.’సమగ్ర కుటుంబ సర్వే’ లో అన్ని వివరాలు ఉన్నాయి అన్నారు మరి బీసీ జనాభా లేదా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.అడ్వొకేట్ జెనరల్ లేని రాష్ట్రం తెలంగాణా ఒక్కటే నని సీఎల్పీ ఉపనేత విమర్శించారు. సర్పంచ్ ల కె పర్సన్ ఇంచార్జి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పంచాయితీ ఎన్నికలను కేసీఆర్ కుట్ర పురితనగా ఆపారని ఆయన ఆరోపించారు.సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎలాంటి ఎన్నికలు జరగొద్దని కేసీఆర్ భావిస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ కావాలనే రిజర్వేషన్స్ పై నిర్లక్షయంగా వ్యవహరించారని అన్నారు.పంచాయితీ ఎన్నికలు జరపాలనే చిత్తశుద్ధి కేసీఆర్ కు ఉంటే బీసీ గణన ముందుగానే చేసేవాళ్ళని చెప్పారు.ఎన్నికలు వాయిదా వేయాలనే .. ఇప్పుడు బీసీ గణన అంటున్నాడు .. దీంతో ఎన్నికలు వాయిదా పడతాయి.
కేసీఆర్ చర్యలతో ఫోర్టిన్త్ ఫైనాన్స్ నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉందన్నారు.
పదవీవిరమణ చేస్తున్న సర్పంచ్ లకే పర్సన్ ఇంఛార్జీలుగా కొనసాగించాలని కోరారు.పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం ఇవ్వలేని దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు.
ఎంబీసీ ల అభివృద్ధికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తానన్న కేసీఆర్ వెయ్యిరూపాయలు కూడా ఖర్చు చెయ్యలేదని విమర్శించారు.వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మళ్ళీ టిఆర్ఎస్ కు అధికారమనేది కల్ల అని జీవన్ రెడ్డి తెలిపారు.