టిఆర్ఎస్ లో చేరిక.

హైదరాబాద్:
నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని రాజన్న గూడెం కు చెందిన టీడీపీ, కాంగ్రెస్ కు చెందిన 150 మంది కార్యకర్తలు నియోజకవర్గం టీఆరెస్ ఇంచార్జ్ నోముల నర్సింహులు, ఎంసి కెటి రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో ఈరోజు మంత్రి నివాసంలో టీఆరెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
4 సంవత్సరాల నుండి టీఆరెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఇతర పార్టీలకు రాజీనామా చేసి టీఆరెస్ పార్టీ లో జాయిన్ అవుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.
గతంలో ఎడమ కాలువకు నీళ్లు ఇవ్వలేదు కానీ మా ప్రభుత్వం వచ్చాక టెల్ ఎండ్ వరకు నీళ్లు ఇచ్చామన్నారు.ముఖ్యమంత్రి నాగార్జున సాగర్ ప్రజలకు చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు 60 సంవత్సరాలు పాలించి కనీసం కాలువ పక్కన రైతులకు కూడా నీళ్లు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు.