టిఆర్ ఏస్ లో భారీగా చేరికలు.

ఖమ్మం:
ఖమ్మం జిల్లా తనికెళ్ల గ్రామంలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నుంచి 182 కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరారు.గులాబీ కండువాలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు.సీఎం కేసీఆర్ పాలన , అభివృద్ది పథకాలు చూసి అనేక మంది టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎం.పి. చెప్పారు. రైతుల పట్ల సీఎం కేసీఆర్ కు ప్రత్యేకమన ప్రేమ ఉన్నదన్నారు.దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు.బడ్జెట్ లో పెట్టిన ప్రతీ పైసా, సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నారని ఎం.పి.వివరించారు.ఖమ్మం జిల్లా లో 9 లక్షల 75 వేల ఎకరాలకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇచ్చి తీరుతామని ఆయన ప్రకటించారు. రైతుబంధు కార్యక్రమం ద్యారా ప్రతీ రైతుకు పెట్టుబడి అందించామని తెలిపారు. కేసీఆర్ పథకాలను కర్ణాటక అనుసరిస్తున్నట్టు తెలిపారు.ఉనికిని కోల్పోతున్న ప్రతిపక్షాలు బట్టకాల్చి ప్రభుత్వం మీద వస్తున్నాయన్నారు.
బంగారు తెలంగాణ నిర్మించగల దమ్మున్న నాయకుడు కేసీఆర్ మాత్రమేనన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటాం, అండగా ఉంటామని పొంగులేటి తెలిపారు.