టికెట్ ప్లీజ్!!! పాపం నాయిని.!!

హైదరాబాద్;
తెలంగాణ హొమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డిని చూస్తే జాలేస్తుంది. టిఆర్ఎస్ ముషీరాబాద్‌ అభ్యర్థి విషయంలో చిక్కుముడి అలాగే ఉన్నది. టిఆర్ఎస్ టికెట్టు రాని పక్షంలో కాంగ్రెసులో చేరాలని హోమ్ మంత్రి అల్లుడు శ్రీనివాసరెడ్డి ఆలోచిస్తున్నట్టు కొన్ని రోజుల కిందట వార్తలు వెలువడ్డాయి. అలాంటిదేమీ లేదని శ్రీనివాసరెడ్డి ఖండించారు కూడా. తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టిక్కెట్‌ ఇప్పించేందుకు హోం మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. అవసరమైతే తానే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని కొద్దీ రోజుల క్రితం ప్రకటించారు. కేసీఆర్ మనసులో ఏమి ఉన్నదో తెలుసుకోవడం కష్టం. కేసీఆర్ అపాయింటుమెంట్ దొరకలేదో, లేక ఈ సమస్యపై కేటీఆర్ తోనే చర్చించాలని కేసీఆర్ చెప్పారో… తెలియదు. మంత్రి కేటీఆర్ ను కలిసి తన అల్లునికి ముషీరాబాద్ టికెట్టు ఇవ్వాలని నాయిని ప్రాధేయపడినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీ అధ్యక్షునితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ నాయినికి సూచించినట్టు సమాచారం.