టిజెఎస్ 40

బెల్లంపల్లి,మంచిర్యాల,కరీంనగర్,రామగుండం,వరంగల్,సికిందరాబాద్,ఉప్పల్, ఇబ్రాహింపట్నం,తాండూరు,మహబూబ్ నగర్, జడ్చర్ల, కొత్తగూడెం, భూపాలపల్లి తదితర నియోజకవర్గాలలో కోదండరాం ప్రభావం కనిపిస్తున్నట్టు వివిధ సర్వేలు,ఇంటెలిజెన్సు వర్గాల ద్వారా తెలుస్తున్నది.

హైదరాబాద్;

తెలంగాణలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలపైన కోదండరాం నాయకత్వం లోని తెలంగాణ జన సమితి పార్టీ దృష్టిని కేంద్రీకరించింది.ఇందులో బెల్లంపల్లి,మంచిర్యాల,కరీంనగర్,రామగుండం,వరంగల్,సికిందరాబాద్,ఉప్పల్, ఇబ్రాహింపట్నం,తాండూరు,మహబూబ్ నగర్, జడ్చర్ల, కొత్తగూడెం, భూపాలపల్లి తదితర నియోజకవర్గాలున్నాయి.తెలంగాణ జాగృతిలో చాలా కాలంపాటు క్రియాశీలంగా పని చేసిన విద్యాధికుడు దాసరి శ్రీనివాస్ కు భూపాలపల్లి జిల్లా తెలంగాణ యువజన సమితి బాధ్యతలను కోదండరాం అప్పగించారు.శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి సేగ్మెంటులో అధికారపక్షంలో అంతర్గత కలహాలు ఊపందుకున్నాయి.ఈ నే పథ్యంలో తెలంగాణ జనసమితి గట్టి పోటీ నిచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి,కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఆంధ్ర పెట్టుబడిదారుల పెత్తనం ఇంకా కొనసాగడాన్ని బహిరంగంగా ప్రశ్నించిన దాసరి శ్రీనివాస్ జాగృతి కి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు.తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన నాయకులకు పార్టీలో పెద్ద పీత వేయడం, వారిని మంత్రులుగా అధికారం కట్టబెట్టడం పట్ల ఆయన తీవ్ర నిరసన తెలియజేశారు.ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోగా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తనను కలచివేశాయని ఆయన అన్నారు.కెసిఆర్ కుటుంబ పాలన వల్ల రాష్ట్రం ఒక రాచరిక వ్యవస్థగా మారిపోయిందంటూ అయన ఎం.పి.కవితకు గత ఫిబ్రవరిలో రాసిన లేఖలో ఆరోపించారు.ప్రభుత్వాన్ని, మొత్తం అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకొని మంత్రులను, శాసన సభ్యులను రబ్బర్ స్టాంపులుగ మార్చివేశారని కూడా దాసరి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు.తెలంగాణలో మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన అన్నారు.రాష్ట్ర విభజన తర్వాత కెసిఆర్ కుటుంబం మినహా మరెవరూ బాగుపడలేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి పేరిట దోపిడీ జరుగుతున్నదని,కెసిఆర్ మాటల గారడీతో పాలన సాగిస్తున్నారని దాసరి మండిపడ్డారు.తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే న్ని ప్రకటించిన్ కెసిఆర్ ఆ హామీని తుంగలో తొక్కారని శ్రీనివాస్ ఆరోపణ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వెనుకబడిన కులాల వారికి న్యాయం జరుగుతుందని ఆశించిన తాను తీవ్ర నిరాశకు గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కెసిఆర్ కుటుంబ దాస్య శృంఖలాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికే తాను నిర్ణయించుకున్నట్టు తెలిపారు.ఎం.పి. కవిత నాయకత్వంలోని తెలంగాణ జాగృతిని ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలకు చేరవేయడంలో దాసరి కృషి చాలా ఉన్నది. వరంగల్ ‘నిట్’ లో ఎం టెక్ పూర్తి చేసిన బిసిలకు చెందిన ఈ యువనాయకుడు తెలంగాణ జన సమితికి నిస్సందేహంగా ‘అసెట్ ‘కానున్నారు.కాళోజీ నారాయణరావు,ప్రొఫెసర్ జయశంకర్, కోదండ రాం, కెసిఆర్ స్ఫూర్తితో తాను ‘నిట్’ తెలంగాణ స్టూడెంట్స్ పేరుతో ఒక సంఘాన్ని పెట్టి తెలంగాణా ఉద్యమంలో పనిచేశానని,నేషనల్ సాలిడారిటీ కమిటీ ఫర్ సపరేట్ తెలంగాణ ఏర్పాటులోనూ తాను క్రియాశీల పాత్ర పోషించి ధిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొన్నామని చెప్పారు.తెలంగాణ నేటిజన్స్ ఫోరం ను 2011 లో ఏర్పాటు చేశానని తెలిపారు. కొంతకాలం వరంగల్ లో లెక్చరర్ గా పనిచేసినా అందులో ఇమడలేక వచ్చేశానని అన్నారు.2012లో కవిత పిలుపు మేరకు తెలంగాణా జాగృతి లో చేరానని దాసరి శ్రీనివాస్ చెప్పారు.అయితే ఊహించినదానికి పరిస్థితులు భిన్నంగా మారడంతో తాను అ సంస్థతో తెగతెంపులు చేసుకున్నానని కోదండరాం సారధ్యంలోని జనసమితి లో చేరినట్టు దాసరి ‘తెలంగాణ కమాండ్’ కు తెలిపారు.
ఉత్తర తెలంగాణలో 10 నియోజకవర్గాలు, దక్షిణ తెలంగాణలో 16 నియోజకవర్గాలపై కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి ప్రభావం కనిపిస్తోందన్న అంశంపై అధికారపక్షం తెలంగాణ రాష్ట్ర సమితిని కలవరపరుస్తున్నది.టీజేఎస్‌ పార్టీ గురించి మీకు తెలుసా? కోదండరాం, ఆయన పార్టీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయమవుతుందని భావిస్తున్నారా? టీజేఎస్‌ ఆరోపిస్తున్నట్టు అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందనుకుంటున్నారా? టీజేఎస్‌ పార్టీ చెప్తున్నట్టు సామాజిక న్యాయం ఆపార్టీ ప్రజలకు అందిస్తుందని భావిస్తున్నారా? టీజేఎస్‌ పార్టీకి రాజకీయ పరిపక్వత, ఆర్థిక స్థిరత్వం కల్గి ఉందని భావిస్తున్నారా? అనే ప్రశ్నల ఆధారంగా సర్వే చేయించినట్టు సమాచారం. తెలంగాణ జన సమితి వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశంపై ఇంటెలిజెన్స్‌ బృందాలు అంచనా వేస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, వాటి బలాలు, బలహీనతలపై అధ్యయనం, సర్వేలు, ప్రజల మనోగతాన్ని ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో రూపొందించే ఇంటెలిజెన్స్‌ వర్గాలు టీజేఎస్‌పై ఐదు ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. ఉద్యోగ, నిరుద్యోగ, రైతు, యువత, మైనారిటీ, వివిధ కులాలు, వర్గాల నుంచి అభిప్రాయం సేకరించాయి. ప్రతి నియోజకవర్గం నుంచి 500 నుంచి 1,000 మందితో ఈ సర్వే నిర్వహించినట్లు సమాచారం.అటు ఉద్యోగ వర్గాలు, ఇటు నిరుద్యోగులపై జనసమితి ప్రభావం ఎక్కువగా ఉంటుందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. కేవలం కొంత మంది ఉద్యోగ నేతలకే అధికార పార్టీ గుర్తింపు ఇవ్వడం మిగతా సంఘాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైనట్లు ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతను కోదండరాం పార్టీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలున్నాయని నిఘా వర్గాలు సర్వేలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో అత్యధిక శాతం ఎమ్మెల్యే సీట్లను ఉద్యోగ సంఘ నేతలు ఆశించేలా పరిస్థితులున్నాయని కూడా ఇంటలిజెన్స్‌ అధికారులు నివేదికలు రూపొందించారు.
టీజేఎస్‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, టీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపే ప్రాంతాలను ఇంటెలిజెన్స్‌ వర్గాలు స్పష్టంగా గుర్తించినట్లు తెలిసింది