టీఆరెఎస్ లో సీఎం అభ్యర్థి ఎవరు? – టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు పొన్నం.

హైదరాబాద్:
కేసీఆర్ ,కవిత ,హరీష్ ,కేటీఆర్ ,కడియం శ్రీహరి ,ఈటెల రాజేందర్ లలో ఎవరు సీఎం అభ్యర్థి అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ప్ర శ్నించారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ భాద్యతలు అప్పగించిన కాంగ్రెస్ హై కమాండ్ ,రాష్ట్ర పీసీసీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.బడుగు బలహీనవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను గ్రామా గ్రామానికి తీసుకెళ్తామని చెప్పారు.
కేసీఆర్ మూడువందల సంవత్సరాలు కాదు ఇంకేమైనా అరిగిపోయేవరకు చేసినా సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. పార్లిమెంట్ లో ఒకో సంఘటన చరిత్రలో నిలిచిపోయే విదంగా కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేశారని మాజీ ఎంపీ గుర్తు చేశారు. పార్లమెంట్ లో కేసీఆర్ పాత్రా ఏమి లేదన్నారు. విభజన బిల్లులో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ,ముంపు గ్రామాలు , రైల్వే కోచ్ ఇవ్వని ఎందుకు తీసుకురాలేకపోతున్నావని ప్రశ్నించారు. తనకు ఇచ్చిన బాధ్యతలతో పార్టీ బలోపేతం , గెలుపుకోసం కోసం కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెసు కన్నా ఎక్కువ అసంతృప్తులు ,గొడవలు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పార్టీ లో ఉన్నాయని పొన్నం చెప్పారు. తమ పోరాటం కేసీఆర్ పైనేనని దీనికోసం అందరం కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు. బ్రోకర్లు ,జోకర్లు ఎవరో కోమటిరెడ్డి రాజగోపాల్ చెప్పాలని పొన్నం మండిపడ్డారు.
ఎన్ఎస్ యుఐ , యూత్ కాంగ్రెస్ నుండి రాజగోపాల్ రాలేదని, నేరుగా 2009 లో ఎంపీగా టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు.ఇంకా ఏదైనా ఉంటె రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలని, లేకపోతే పార్టీ ఫోరం లోకి వస్తే చర్చించుకుందామని పొన్నం అన్నారు.