టీఆరెస్ అభ్యర్థులను తరిమికొడుతున్నారు. – బీజేపీ నాయకుడు శ్రీధర్ రెడ్డి.

హైదరాబాద్:

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తరిమికొడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి తెలిపారు.”అసెంబ్లీ రద్దు అయిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని 26 రోజుల తరువాత తీరిగ్గా ప్రకటించినది. ఈమధ్య కొన్ని పథకాల్లో ఆపద్ధర్మ మంత్రులు పాల్గొన్నారు వాటిపైన ఎన్నికల కమిషన్ స్పందించాలి.కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న గని ప్రారంభోత్సవాల్లో ఏ విధంగా టీఆరఎస్ నేతలు పాల్గొంటున్నారు.

రైతులకు మేలు జరిగే పథకాలకు మేము వ్యతిరేకం కాదు. బతుకమ్మ చీరెలు ఏవిధంగా పంచుతారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.
రైతులు మహిళలు అభివృద్ధి విషయంలో మేము అడ్డం కాదు. కాకపోతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటె ఏ విధంగా వీటిని అమలు చేస్తారు?
మాజీ ఎమ్మెల్యేలు ప్రవర్తన రోజు రోజుకి తార స్థాయికి చేరుతుంది. టిఆర్ఎస్
రోజు రోజు కి వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది. రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల మీద ఆస్తులపై ఐటీ ఈడీ దాడులు జరిపాయి.కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై దాడులు చేయించారని ఆరోపిస్తున్నారు. బీజేపీ కి ఆ అవసరం లేదు. బీజేపీ కి ఈ దాడులకు ఎటువంటి సంబంధం లేదు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఆరోపణలపై ప్రజలే ఓటు ద్వారా బుద్ధి చెప్తారు” అని శ్రీధర్ రెడ్డి అన్నారు.