టీఆరెస్ నేతలకు మావోయిస్టుల వార్నింగ్.

భద్రాద్రి కొత్తగూడెం:
మణుగూరు మండలంలో మావోయిస్టుల కరపత్రాల కలకలం. మణుగూరు మండలం విజయనగరం గ్రామంలో మావోయిస్టుల కరపత్రాలు, ఎమ్మెల్యే పాయం అనుచరులతో పాటు మరికొంతమందికి హెచ్చరిక జారీ.. గ్రామంలో ఇసుక దందా, భూసేటిల్మెంట్స్, భూకబ్జాలకు పాల్పడుతూ కుల రాజకీయాలకు రెచ్చగొడుతున్న ఎనిమిది మందికి వార్నింగ్.. పద్దతి మార్చుకోకపోతే ఏరివేత తప్పదని మావోయిస్టు పార్టీ చర్ల, దుమ్ముగూడెం ఏరియా కార్యదర్శి హెచ్చరించారు.