టీఆరెస్ మాయాజాలం, సబ్సిడీ ట్రాక్టర్ల అవకతవకలపై లోకాయుక్త విచారణ


హైదరాబాద్:

సబ్సిడీపై ట్రాక్టర్ల పంపిణీలో అక్రమాలపై లోకాయుక్త విచారణ చెపట్టింది.మహబూ బాబాద్ జిల్లా కురవి మండలంలో సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ లో అక్రమాలు జరిగినట్లు లోకాయుక్త కు ఫిర్యాదులు అందాయి. పారదర్శకత పాటించకుండా trs నాయకులు ఏకపక్షంగా ట్రాక్టర్లు పంచుకొని పేద రైతులకు అందకుండా రెడ్యానాయక్ సిఫార్సు చేసిన వ్యక్తులకు ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ లోకాయుక్తలో గిరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కేసును విచారణకు స్వీకరించారు. మండలంలో భూమి లేని వారికి,అనర్హులకు అందించటంలో సహకారము అందించిన మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఫోర్జరీ చేసి ట్రాక్టర్లు పొందిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని లోకాయుక్తను కోరారు.

అలాగే వ్యవసాయ ట్రాక్టర్లను అమ్ముకున్న వారిపై కొనుగోలు చేసిన వారిపై రీసెల్ కు సహకరించిన ట్రాక్టర్ షూరూమ్ వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని గిరి కోరారు. వ్యవసాయ సబ్సిడీ ట్రాక్టర్లు వ్యవసాయేతర వినియోగానికి వాడుతున్న వ్యక్తులపై విచారణ జరపాలని కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి. వై. గిరి కోరారు.