టీఆర్ఎస్ తీర్ధం తీసుకోనున్న మోత్కుపల్లి?

హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పై ఆ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు శుక్రవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కెసిఆర్ ను ఆకాశానికి ఎత్తారు. త్వరలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం సిద్ధమైందని టిడిపి లో ప్రచారం సాగుతోంది.

మోత్కుపల్లి మాటల్లోనే నేరుగా…

‘నేను ఏ తప్పు చేశాను…..అది చంద్రబాబు చెపితే బాగుంటుంది.నా జీవితం చంద్రబాబు కే అంకితం చేశాను.రాజకీయ నాయకులు తప్పులు చేయడం సహజం.రాజకీయాల్లో కులం,డబ్బు ఉండాలి.నా లాంటి వాడు రాజకీయాల్లో ఉండలేడు.దళితుడిని ఐనందుకే నన్ను ఇలా అవమానిస్తున్నారు.నా తప్పు చంద్రబాబు చెబితే….. ముక్కు నేలకు రాస్తా.రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖులు చేసిన తప్పుకు…. పార్టీ నష్ట పోయింది.బీసీ నేత కృష్ణయ్య…. పార్టీ కి ఇప్పుడు ఎందుకు దూరమయ్యారు.రమణ ను కాదని….రేవంత్ ను సీఎం అభ్యర్థిగా ఎలా ఎక్సుపోస్ చేశారు.ఓటుకు నోటు కేసులో రేవంత్ పై ఎందుకు చర్య తీసుకోలేదు.టిఆర్ ఎస్ ప్రభుత్వం ను పడగొట్టే కుట్ర ఎందుకు వచ్చింది..?నాదెండ్ల పరిస్థితి వస్తే…టీడీపీ నేతలను జనం ఉరికించేవారు.మీ అనుమతి తోనే కాంగ్రెస్ లో చేరుతున్నానని రేవంత్ ఎందుకు చెప్పుకున్నాడు.
ఒక సీనియర్ నైనా నాకే ఇంత అవమానమా…..?అన్యాయమా…?ఒక్క ఎమ్మెల్సీ కోసం అంత కుట్ర అవసరమా…?
నా బిడ్డ పెళ్లికి రమ్మంటే ఆలస్యంగా వచ్చిన చంద్రబాబు…… రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి అన్నీ తానై చేశాడు బాబు.అదే కేసీఆర్ …పిలువగానే నా బిడ్డ పెళ్లికి వచ్చారు.నేనె పెద్ద మాదిగ అని చెప్పిన బాబు…ఇప్పుడు నన్ను ఇలా ఎందుకు చేస్తున్నావ్…
కేసీఆర్ తో స్నేహంగా ఉండమని నేను చెప్పినందుకే… నా పై ఇంత కోపమా.పెద్ద మాదిగను అని చెప్పుకున్న మీరు…..ఏబిసిడి వర్జికరణ చేసే బాధ్యత మీ పై లేదు.కనీసం… నన్ను పిలిచి అడిగే బాధ్యత మీ పై లేదా.ఒక ఫాల్త్ వ్యక్తిని పట్టుకొని….ఇక్కడ పార్టీ ని నాశనం చేశారు.ప్రత్యామ్నాయ0 మేమే అని చెప్పుకుంటూ ఇక్కడ పార్టీ ని ఎలా బతికిస్తారు.నన్నే ఇలా అవమనపరుస్తున్నావంటే…ఇక దళితులను నీవు ఎలా చూస్తున్నావో తెలుస్తుంది.అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని…. నన్ను అవమనపరచడం సరైందా.నా తప్పు చెప్పు.నీ ఇంటికి వచ్చి ముక్కు నేలకు రాసి పోతా.నీకు నమ్మిన వ్యక్తి గా ఉన్నా
నీ వెంట ఇక్కడి వారు ఎవరూ లేరు….అలాంటిది ఇక్కడ ఎవరితో పొత్తు పెట్టుకుంటావ్..
పార్టీ లో ఎవరూ లేరు…స్మశానం లా మారింది.
ఇక్కడ పార్టీ కి సమయం ఇవ్వాలి.
చుట్టపు చూపుగా వస్తే…..పార్టీ బతకదు.
నిన్ను నమ్మే వారిని..నీవు నమ్మవ్.
నిన్ను నమ్మని వారిని నీవు నమ్ముతావ్.
నిన్ను నమ్మి మోసపోయానో…లేదో మీరే చెప్పాలి.ఇది నమ్మక ద్రోహం కాదా…
గవర్నర్ పదవి నీ చేతిలో లేకున్నా…. ఎంపీ ఇస్తానని నాకు ఎందుకివ్వలేదు.
నాకు ఇవ్వాల్సిన ఎంపీ పదవి…గరికపాటికి,టిజి వెంకటేష్ కు ఇచ్చావ్.దేశాన్ని ఒక్కటి చేస్తానని చెప్పే మీరు….పిచ్చుక పై బ్రమ్మస్త్రం వలె నా పై మీకు అంత కోపం ఎందుకు.మిమ్ములను నమ్మి పని చేసినందుకు….నాకు షుగర్ వచ్చింది.ఎన్టీఆర్ వెంట ఉన్న వారిలో ఇప్పుడు బాబు వద్ద నేను,బుచ్చయ్య చౌదరి మిగిలా0.ముద్దు కృష్ణమ నాయుడు చనిపోయాడు.నన్ను పిలవండి….లేదంటే…. ఆంధ్ర కు వచ్చి నేను ఏ తప్పు చేశానో ఊరూరా తిరుగుతా.మహానాడుకు అంత తక్కువ మందియా.నేను మీటింగ్ పెడితే…10 వేల మంది వస్తరు.”