టీఆర్ఎస్ నాదే. చొప్పదండి నాదే. – బొడిగ శోభ.

కరీంనగర్:
చొప్పదండి నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థిని తానేనని మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ స్పష్టం చేశారు. కేసీఆర్ తనకే టికెట్ ఇవ్వనున్నట్టు ఆమె గురువారం తెలిపారు. టిఆర్ఎస్ తో ఉద్యమ సమయం నుంచి, అధికారం వచ్చిన తర్వాత కూడ విడదీయరాని బందం ఉందన్నారు.
కేసీఆర్, కేటీఆర్ లకు తన మీద అపారమైన నమ్మకం ఉందని శోభ చెప్పారు. తాను సోషల్ మీడియాలో బీజేపీ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆమె ఖండించారు.18 ఏళ్ల టీఆర్ఎస్ తో ఉన్న అనుభందాన్ని తెంపుకునేది లేదన్నారు.
కేసీఆర్ కు తాను కూతురు లాంటి దానినన్నారు. శుక్రవారం నుంచి పల్లె , పల్లె ప్రచారం మొదలు పెడుతున్నట్టు శోభ ప్రకటించారు. పార్టీ లో క్రమశిక్షణ గల ఎమ్మెల్యే గా పని చేసినట్టు తెలిపారు.బీజేపీలో చేరే ప్రసక్తే లేదన్నారు. మీడియా అలాంటి ప్రచారాలను చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.