టీఆర్ఎస్ ‘భజన’ మీడియాను కట్టడి చేయాలి. – టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్.

హైదరాబాద్:
రాష్ట్రంలో టీఆరెస్ అనుకూల మీడియాను ఈసీ నియంత్రించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రసారాలు చేస్తూ కాంగ్రెస్ పై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు.గల్లీ నుండి ఢిల్లీ వరకు కాంగ్రెస్ ఉంటె రాష్ట్ర అభివృద్ధి మరింత సులవుతుందన్నారు.టీఆరెస్ వోటువేయడం అంటే దొంగకు తాళం ఇచ్చినట్లే నని చెప్పారు. ప్రగతి భవన్ కూర్చుని కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతోమాట్లాడుతున్నారని తెలిపారు.కేసీఆర్ షోలే సినిమాలో గబ్బర్ సింగ్ లాంటోడన్నారు.