హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని, ప్రజల సమ్రగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తూ పని చేస్తున్న సీఎం కెసిఆర్ అని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టిఆర్ఎస్లో చేరి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉర్కొండ మండలం ఇప్పపాడుకు చెందిన బిజెపి, కాంగ్రెస్, టిడిపిలకు చెందిన పలువురు నేతలు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారి నుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తున్నదన్నారు. సిఎం కెసిఆర్ తన ప్రతిభా పాఠవాలతో అనేక పథకాలను ప్రారంభించి,అమలు చేస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో ఉందన్నారు.దేశం మొత్ం చూపు తెలంగాణ వైపే ఉందన్నారు.అనేక పథకాలను ఉదహరిస్తూ, అవన్నీ తెలంగాణ ప్రజల సమగ్ర అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. గతంలో ఉద్యమంలో లేని వాళ్ళు, ప్రతిపక్షాలకు చెందిన నేతలంతా టిఆర్ఎస్లో చేరి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామలు కావాలని పిలుపునిచ్చరు. ఈ సందర్భంగా టిఆర్ఎస్లో చేరిన నేతలు, కార్యకర్తల్లోనుంచి ఇప్పపాడు ఉప సర్పంచ్ నారాన్ సుందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో గత 60ఏళ్ళల్లో జరగని అభివృద్ధి కేవలం ఈ నాలుగేళ్ళల్లో జరిగిందన్నారు. సిఎం కెసిఆర్ రాష్ట్రంలో, జడ్చర్ల నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై తాము టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. టిఆర్ఎస్లో చేరిన వాళ్ళల్లో బిజెవైఎం ఉపాధ్యక్షుడు మాదారం శ్రీనివాసగౌడ్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ దుబ్బ రాములు, వార్డు సభ్యులు బుచ్చయ్య, అంజయ్య, టిడిపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు శివ తదితరులతోపాటు 100 మంది కార్యకర్తలు చేరారు. ఇంకా ఈ కార్యక్రమంల టిఆర్ఎస్ మండల నేతలు నర్సింహారెడ్డి, గిరినాయక్ తదితరులు పాల్గొన్నారు.