టీచర్ కు వేధింపులు. అరెస్టు.

హైదరాబాద్:
ఉపాధ్యాయురాలిని వేధిస్తున్న ఓ వ్యక్తిని ‘షీ ‘టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన ఉస్మాన్‌ తన ముగ్గురు పిల్లలను ప్రతిరోజు ట్యూషన్‌కు తీసుకెళతాడు. టీచర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఉపాధ్యాయురాలు ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయినా వేధింపులు ఆగలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు షీటీం అతడిని అదుపులోకి తీసుకొని ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు.