టీడీపీ అధికారప్రతినిథి యామినిపై కేసు!!


టీడీపీ అధికారప్రతినిథి యామినిపై కేసు!!

Hyderabad:

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై అభ్యంతరకర ట్వీట్ చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై ఫిర్యాదు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గౌతమ్ సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తామని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే . రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్ సోమవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధినేని యామినిని అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.