టీవీల్లోనూ నేరచరిత్ర ప్రసారం చేయాలి.

న్యూఢిల్లీ;

రాజకీయాల్లో నేరచరిత నేతలకు చెక్ చెప్పే దిశగా చర్యలు చేపట్టింది ఎన్నికల సంఘం. తాము పోటీకి నిలుపుతున్న అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే పార్టీలు అభ్యర్థి ఆ సంగతిని తమకు ముందుగానే తెలియజేసినట్టు రిటర్నింగ్ ఆఫీసర్ కు తెలపాలి. అంతే కాకుండా క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులని పోటీకి దించుతున్న పార్టీ, ఆయా అభ్యర్థుల నేర చరిత్ర గురించి పూర్తి సమాచారాన్ని తమ అధికారిక వెబ్ సైట్ లో పెట్టాలి. వార్తాపత్రికలు, టెలివిజన్ చానెళ్లలో తమ అభ్యర్థుల క్రిమినల్ హిస్టరీ గురించి ప్రచురణ, ప్రసారాల ద్వారా వివరించాలి.నేర చరిత్ర విషయంలో పూర్తిగా పార్టీలపైనే భారం వేయకుండా అభ్యర్థులను కూడా జవాబుదారీగా చేసింది. క్రిమినల్ కేసులు ఉన్న అందరు అభ్యర్తులు తమ నేర చరిత్ర గురించి మొత్తం సమాచారాన్ని వార్తాపత్రికలు, టెలివిజన్ చానెళ్ల ద్వారా ఓటర్లకు తెలిసేలా చేయాలి. ఎన్నికల ప్రచారం ముగిసేలోగా మూడు సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని సూచనలను త్వరలోనే సవివరంగా అందజేయనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.