టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ ధరలు తగ్గుతున్నాయ్.

న్యూఢిల్లీ:
టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు కొందామనుకొనే వారికి శుభవార్త. దసరా ధమాకా, దీవాలీ బంపరాఫర్లతో సంబంధం లేకుండా కంపెనీలు డిస్కౌంట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. గత వారం జీఎస్టీ కౌన్సిల్ 15 రకాల గృహోపకరణాలపై పన్ను రేట్లను 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో సంస్థలు కూడా ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించబోతున్నాయి. అందువల్ల ఇవాళ్టి నుంచి ఆ మేరకు ధరలు తగ్గనున్నాయి.జీఎస్టీ భారం తగ్గిన జాబితాలో 27 అంగుళాల లోపు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, గ్రైండర్లు, హ్యాండ్‌ డ్రైయర్లు ఉన్నాయి. త్వరలోనే వీటి ధరలను 7–8 శాతం వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.