టీవీ9 రవిప్రకాష్ కు స్ఫూర్తినిచ్చిన సిద్ధిపేట అభివృద్ధి.

సిద్దిపేట:
సిద్ధిపేట అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తే ఆనందంగా ఉన్నట్లు టీవీ9 సిఇఓ రవిప్రకాష్ అన్నారు. మంత్రి హరీష్ రావు అభివృద్ధి మాట్లల్లో చెప్పలేనన్నారు. మంత్రి హరీష్ అభివృద్ధి లో భాగస్వామ్యం అవుతున్నందుకు తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల కష్టం అర్థం చేసుకొని సామాజిక దృక్పథం, సేవా భావం చాటిన టీవీ9 రవి ప్రకాష్ కు హరీశ్రావు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భవనాన్ని నిర్మించి ఇస్తానని, పేద పిల్లలపై తన అభిమానాన్ని చూపించనందుకు సంతోషంగా ఉందన్నారు.సిద్దిపేట రంగాదాం పల్లిలో టీవీ9 రవి ప్రకాశ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన పాఠశాలకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు , tv9 ceo రవి ప్రకాష్.