టీ పొడి కల్తీ.500 కిలోల టీ పొడి జప్తు.

అమరావతి:
గొల్లపూడి హొల్ సేల్ మార్కెట్ లో 283 వ షాపులో విజిలెన్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం దాడులు జరిపారు. టీపొడి కల్తీ చేస్తున్నారని అందులో కలర్ రావడం కోసం వాడకూడని కలర్ ను కలుపుతున్నా రనే సమాచారంతో దాడులు జరిగాయి. 500 కేజీల టీపొడిను సీజ్ చేశారు.
పక్కా సమాచారంతో దాడులు చేశామని విజిలెన్స్ ఎస్.పి.హర్షవర్ధన్ తెలిపారు.
టీ పొడిలో కలర్ కలుపుతున్నారని రుజువైందని చెప్పారు.ప్యాకింగ్ కూడా రూల్స్ కి విరుద్దంగా చేస్తున్నారని అన్నారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా కేసులు కడతామని తెలియజేశారు.
ప్రస్తుతానికి లైసెన్స్ క్యాన్సిల్ చేశామని ఎస్.పి.చెప్పారు.నేరం రుజువైతే 10 ఏళ్ళు జైలు , 10 లక్షల జరిమానా ఉంటుందని ఆయన వివరించారు.